ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను క‌రోనా ఏ స్థాయిలో భ‌య‌పెడుతుందో చూస్తేనే ఉన్నాం. వ్యాక్సిన్ లేని ఈ ప్రాణాంత‌క క‌రోనా.. అటు ప్ర‌జ‌లకు, ఇటు ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు దేశ‌దేశాలు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతోంది. అయితే ఏపీలో ప్రభుత్వం గతేడాది భారీగా గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. 

IHG

పలు కారణాల వల్ల గ్రామ సచివాలయాల్లో 14062 పోస్టులు ఉండగా, వార్డు సచివాలయాల్లో 2146 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ క్ర‌మంలోనే మొత్తం 16,208 పోస్టుల్ని భర్తీ చేసేందుకు  ఏపీ ప్రభుత్వం జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో 11 లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నార‌ట‌. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పరీక్షలు ఆగిపోయాయి.  అయితే ఈ  గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి.. పరీక్షల కోసం ఎదురుచూస్తున్న‌వారికి గుడ్‌న్యూస్ అని చెప్పాలి.

IHG

ఆగస్టులో పరీక్షలు జరగనున్నాయి. ఆగస్ట్ రెండో వారంలో ఎగ్జామ్స్ నిర్వహించేందుకు పంచాయతీరాజ్‌ శాఖ సన్నాహాలు చేస్తోంది.  ప్రస్తుతం క‌రోనా లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు స్టాట్ అయ్యాయి. ఇందులో భాగంగా.. ఆగస్ట్ 9 నుంచి 14 వరకు పరీక్షల్ని నిర్వహించాలని పంచాయతీ రాజ్ శాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మ‌రియు జూన్ 28 లోగా పరీక్షా కేంద్రాలను గుర్తించనున్నారు. మ‌రోవైపు ఇప్పటికే షెడ్యూల్‌ను రూపొందించి ప్రభుత్వం అనుమతి కోసం పంపింది. అనుమతి రాగానే షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేయనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: