గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూన్ 24వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎంతో మంది మ‌హానుభావులు జ‌న్మించిన రోజు... ప్ర‌పంచాన్ని ముందుకు న‌డిపించేందుకు పాదు కోల్పిన రోజ‌ని చెప్పాలి. తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే కాదు...త‌న న‌ట‌న‌తో దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న విజ‌య‌శాంతి పుట్టిన రోజు ఈరోజే. త‌న సంగీతంతో శ్రోత‌ల‌కు ఆనందం పంచిన ఎమ్మెస్ విశ్వనాథన్ జ‌యంతి కూడా నేడే. ఇంకా మ‌హానుభావుల గురించి, ముఖ్య సంఘ‌ట‌న‌ల స‌మాచారం... హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం..

 

ముఖ్య సంఘ‌ట‌న‌లు..

1950: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు బ్రెజిల్లో ప్రారంభమయ్యాయి.
1963: భారత తంతి తపాలాశాఖ టెలెక్స్ సేవలను ప్రారంభించింది.

జననాలు

1896: జి.వి. కృపానిధి, పలు ఆంగ్లపత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన తెలుగువాడు. (మ.1970)
1902: గూడవల్లి రామబ్రహ్మం, సినిమా దర్శకులు, సంపాదకులు. (మ.1946)
1902: జమిలి నమ్మాళ్వారు, ప్రచురణకర్త, పత్రికా సంపాదకుడు
1915: పాలగుమ్మి పద్మరాజు, తెలుగు సినీ రచయిత. (మ.1983)
1924: చతుర్వేదుల నరసింహశాస్త్రి, సాహిత్యవేత్త. (మ.1991)
1928: ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. (మ.2015)
1940: మాగంటి మురళీమోహన్, తెలుగు సినిమా కథానాయకుడు, నిర్మాత.
1964: విజయశాంతి, తెలుగు సినిమా నటి.

మరణాలు

1890: తల్లాప్రగడ సుబ్బారావు, అసాధారణ మేధావి. (జ.1856)
1908: గ్రోవర్ క్లీవ్‌లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు (జ.1837).
1964: కొత్త రాజబాపయ్య, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యాబోర్డులో, రాష్ట్రవిద్యాసలహాసంఘం సభ్యుడు (జ.1913).
2008: మల్లికార్జునరావు, తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు (జ.1960).
2015: పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు (జ.1927).
2016: నీల్ ఓబ్రీన్, భారతదేశంలో మొట్టమొదటి క్విజ్ మాస్టర్ (జ.1934).

 

మరింత సమాచారం తెలుసుకోండి: