ప్ర‌పంచ‌దేశాలు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతున్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది డిసెంబ‌రులో చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌భుత్వాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. దీంతో ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా దేశ‌దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మ‌రోవైపు . క‌రోనా ప్ర‌భావం ఉద్యోగుల‌పై తీవ్రంగా ప‌డింద‌ని చెప్పొచ్చు. క‌రోనా కార‌ణంగా న‌ష్టాలు ఎదుర్కొంటున్న ప‌లు కంపెనీలు ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌డానికి త‌మ ఉద్యోగులు ఇంటికి సాగ‌నంపుతున్నారు. 

 

అయితే ఇలాంటి స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య శాఖలో భారీగా ఖాళీల భర్తీ జరుగుతోంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయాలు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. జిల్లాలా వారీగా పోస్టుల్ని భర్తీ చేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.  విజయనగరం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 757 ఖాళీలు ఉన్నాయి. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, రేడియోగ్రాఫర్ లాంటి పోస్టులున్నాయి. పోస్టుల వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే.. గుంటూరు మొత్తం 218 ఖాళీలు ఉండ‌గా.. అందులో స్టాఫ్ నర్స్- 119, ల్యాబ్ టెక్నీషియన్- 43, ఫార్మాసిస్ట్- 23, ఎంఎన్ఓ- 18, ఎఫ్ఎన్ఓ- 15 పోస్టులు ఉన్నాయి.

 

డీఎంహెచ్ఓ విజయనగరంలో మొత్తం 129 ఖాళీలు ఉండ‌గా.. అందులో స్టాఫ్ నర్స్- 76, ల్యాబ్ టెక్నీషియన్- 26, ఫార్మాసిస్ట్- 27 పోస్టులు ఉన్నాయి. డీఎంహెచ్ఓ కృష్ణాలో మొత్తం 154 ఖాళీలు ఉండ‌గా.. స్టాఫ్ నర్స్- 98, ల్యాబ్ టెక్నీషియన్- 27, ఫార్మాసిస్ట్- 26, రేడియో గ్రాఫర్- 02, పీఎంఓఓ-03, ఎంఎన్ఓ- 30, ఎఫ్ఎన్ఓ- 25 పోస్టులు ఉన్నాయి. అలాగే డీఎంహెచ్ఓ నెల్లూరులో మొత్తం 154 ఖాళీలు ఉండ‌గా.. అందులో స్టాఫ్ నర్స్- 92, ల్యాబ్ టెక్నీషియన్- 50, ఫార్మాసిస్ట్- 22 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి విజయనగరం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జూలై 22 లోగా, కృష్ణా జిల్లాలో జూలై 24 లోగా అప్లై చేయాలి. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ధ‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: