ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా ప‌ట్టిపీడిస్తున్న విష‌యం తెలిసిందే. ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా.. ఇప్పుడు ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని ఈ కరోనా దెబ్బకు అన్నిరంగాలు విలవిలలాడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. అలాగే గత రెండు నెలల నుంచి చాలా కంపెనీలు వేల మంది ఉద్యోగులపై వేటు వేశాయి. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల వచ్చిన నష్టాలను భరించలేక ఉద్యోగులను తీసేశాయి కంపెనీలు. 

 

అయితే ఇలాంటి స‌మ‌యంలో కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడ్డ నోటిఫికేషన్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తోంది భారతీయ రైల్వే. ఇందులో భాగంగా.. ఈస్టర్న్ రైల్వే గతంలో 2792 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 4నే ముగిసింది. కానీ, కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దరఖాస్తు చేయడానికి మరో ఛాన్స్ ఇస్తూ.. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో ఈస్టర్న్ రైల్వే. ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్లలో మొత్తం 2792 పోస్టుల్ని భర్తీ చేస్తారు. 

 

వాటి వివ‌రాలు చూస్తే.. మొత్తం ఖాళీలు 2792 ఉండ‌గా.. అందులో హౌరా డివిజన్- 659, సీల్దా డివిజన్- 526మాల్దా డివిజన్- 101, అసన్సోల్ డివిజన్- 412, కాంచ్రపర డివిజన్- 206, లిలువా డివిజన్- 204 మ‌రియు జమల్పూర్ డివిజన్- 684 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. 10వ తరగతి ఉండాలి. లేదా తత్సమాన పరీక్ష పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే 15 నుంచి 24 ఏళ్లు మధ్య వ‌య‌స్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకుంటే రూ.100 ఫీజు చ‌ల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు ఫీజు లేదు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.rrcer.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. కాగా, ఇప్ప‌టికే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ జూలై 9. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: