ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ్యాక్సిన్ లేని ఈ క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు. చైనా నుంచి మొద‌ట‌ ఐరోపాకు చేరిన మహమ్మారి అనంత‌రం అమెరికాకు పాకింది. ఐరోపాలోని ఇటలీ, యూకే, స్పెయిన్ తదితర దేశాలను కరోనా క‌మ్మేసింది. ఆ త‌ర్వాత క్ర‌మంగా అన్ని దేశాల‌ను చూట్టేసిన క‌రోనా.. ల‌క్ష‌లాది ప్రాణాల‌ను పొట్ట‌న‌పెట్టుకుంటోంది. మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలాయి. ఎంద‌రో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్నారు.

 

అయితే ఇలాంటి స‌మ‌యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 29 ఖాళీలు ఉన్నాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఫ్యాకల్టీ రీసెర్చ్ హిందీ ఆఫీసర్ లాంటి ఖాలీలు ఉన్నాయి. వాటి వివ‌రాలు చూస్తే.. మొత్తం ఖాళీలు 29 ఉండగా.. అందులో ప్రొఫెసర్- 2, అసోసియేట్ ప్రొఫెసర్- 2, అసిస్టెంట్ ప్రొఫెసర్- 2, ఫ్యాకల్టీ రీసెర్చ్ అసోసియేట్- 4, రీసెర్చ్ అసోసియేట్- 5, రీసెర్చ్ అసోసియేట్ (టెక్నికల్)- 1, హిందీ ఆఫీసర్- 3, అనలిస్ట్ ప్రోగ్రామర్ విండోస్- 2, అనలిస్ట్ ప్రోగ్రామర్ లైనక్స్- 1, ఐటీ అడ్మినిస్ట్రేటర్- 1, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 3 పోస్టులున్నాయి.

 

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అయితే ఈ పోస్టుల‌కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 30 చివరి తేదీ. అంటే రేపే లాస్ట్ డేట్ అన్న‌మాట‌. కాబ‌ట్టి ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థ‌లు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని.. వెంట‌నే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభించండి. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://ibps.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. కాగా, దరఖాస్తులు ఎడిట్ చేయడానికి 2020 జూన్ 30 చివరి తేదీ. దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి 2020 జూలై 15 చివరి తేదీ. మ‌రియు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయడానికి 2020 జూన్ 10 నుంచి జూన్ 30 వరకే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్ 2020 జూలై 19న ఉండ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: