ప్రస్తుతం ప్ర‌పంచ‌దేశాలు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని విల‌విల‌లాడిపోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది చైనాలో వూహాన్ న‌గరంలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క క‌రోనా భూతం అన‌తి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించి.. విశ్వ‌రూపం చూపిస్తోంది. ఇప్ప‌టికే కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య అయిదు లక్షల మార్క్‌ను దాటేసి 509,164కు చేరుకుంది. ఈ స్థాయిలో మరణాల సంఖ్య పెరుగుతోండటం ఆందోళన కలిగిస్తోంది. మ‌రియు పాజిటివ్ కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి.

 

ఇక మ‌రోవైపు కంటికి కనిపించని కరోనా దెబ్బకు అన్నిరంగాలు విలవిలలాడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. అయితే ఇలాంటి స‌మ‌యంలో నిరుద్యోగుల‌ను ఆదుకునేందుకు భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసంది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ఈ నోటిఫికేష‌న్‌లో 9640 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్కేల్ -I, II, III, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. పోస్టుల వివ‌రాలు చూస్తే.. మొత్తం 9640 ఖాళీలు ఉండ‌గా.. అందులో  ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్)- 4624, ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్)- 3800, ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్-మేనేజర్)- 838, ఆఫీసర్ స్కేల్-II (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్)- 59 పోస్టులు ఉన్నాయి.

 

వీటితో పాటు ఆఫీసర్ స్కేల్-II (చార్టర్డ్ అకౌంటెంట్)- 26, ఆఫీసర్ స్కేల్-II (లా ఆఫీసర్)- 26, ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్)- 03, ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్)- 08, ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్)- 100 మ‌రియు ఆఫీసర్ స్కేల్-III- 156 పోస్టులు ఉన్నాయి. విద్యార్హ‌త విషయానికి వ‌స్తే.. డిగ్రీ, లా, ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. 

 

కాగా, ఈ పోస్టుల‌కు దరఖాస్తు ప్రక్రియ 2020 జూల్ 1న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 21 చివరి తేదీ. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ I పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఆఫీసర్ స్కేల్ II, III పోస్టులకు సింగిల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికా విధానం ఉంటుంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థ‌లు నోటిఫికేష‌న్‌లో పూర్తి వివ‌రాలు తెలుసుకుని ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను.

మరింత సమాచారం తెలుసుకోండి: