గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూలై 2వ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం


ముఖ్య సంఘ‌ట‌న‌లు

1613: సామ్యూల్ అర్గాల్ ఆధ్వర్యంలో మెసాచుసెట్స్ నుంచి అకాడియాకి (నేటి క్విబెక్ లోని కొంత ప్రాంతం) మొదటి ఇంగ్లీష్ వారి సాహస యాత్ర ప్రారంమైంది.
1644: ఇంగ్లీష్ సివిల్ వార్ : మా ర్స్ టన్ మూర్ యుద్ధం.
1679: డేనియల్ గ్రేసలన్ డి డు లుత్ నాయకత్వంలో యూరోపియన్లు మొదటిసారిగా మిన్నెసోటా వెళ్ళి అక్కడి మిస్సిసిపి నది హెడ్ వాటర్స్ ని చూసారు.
1698: థామస్ సావెరీ మొదటి స్టీమ్ ఇంజన్ కి పేటెంట్ హక్కులు పొందాడు.
1777: అమెరికా లోని 'వెర్మెంట్' అనే ప్రాంతంలో మొదటిసారిగా 'బానిసత్వాన్ని' నిర్మూలించారు.
1823: బహియా దేశ స్వాతంత్ర్య దినం : బహియా దేశంలో జరిగిన ఆఖరి యుద్ధంలో పోర్చుగీసు వారు ఓడిపోయారు. ఆ ఓటమితో బ్రెజిల్లో పోర్చుగీసు వారి పాలన అంతమయ్యింది.
1839: 53 మంది తిరుగుబాటు ఆఫ్రికన్ బానిసలు, జోసెఫ్ సిన్క్య్ నాయకత్వంలో, క్యూబా తీరానికి 20 మైళ్ళ దూరంలో, బానిసలతో ప్రయాణిస్తున్న నౌక 'అమిస్తాడ్' ని స్వాధీనం చేసుకున్నారు.
1863: అమెరికన్ సివిలి వార్ : గెట్టిస్ బర్గ్ యుద్ధం ప్రారంభమై రెండవ రోజు.
1881: 20వ అమెరికన్ అధ్యక్షుడు జేమ్స్ ఎ. గార్ ఫీల్డ్ ని,ఛార్లెస్ జూలియస్ గిట్యూ,అనే లాయర్ (సమయం 9:30) తుపాకితో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన అమెరికా అధ్యక్షుడు 1881 సెప్టెంబరు 19 న మరణించాడు.
1897 : ఇటాలియన్ వైజ్ఞానికుడు అయిన గూగ్లీమొ మార్కొని లండన్లో రేడియో కోసం పేటెంట్ పొందాడు.
1900 : జర్మనీ లోని కాన్స్ టేన్స్ చెరువులో (ఫ్రీడ్రిఖ్ షాఫెన్ దగ్గర) మొదటి 'జెప్లిన్ విమానం' ఎగిరింది
1940 : స్వాతంత్ర్య యోధుడు సుభాస్ ఛంద్ర బోస్ ని అరెస్ట్ చేసి కలకత్తాలో బంధించారు.
1962 : అమెరికాలోని ఆర్కన్సాస్ రాష్ట్రంలోని 'రోజెర్స్' అనే నగరంలో మొదటి 'వాల్ మార్ట్' చిల్లర దుకాణం వ్యావారం నిమిత్తం మొదలయ్యింది.
1976: ఉత్తర, దక్షిణ వియత్నాం దేశాలు, 22 సంవత్సరాల తర్వాత, తిరిగి ఒకటైనాయి.
2000: ఫ్రాన్సు 2-1 తేడాతో ఇటలీని ఓడించి యూరోకప్-2000 సాధించింది.
2009: స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనంటూ ఢిల్లీ హై కోర్టు తుది తీర్పు వెలువరించింది


జననాలు

1939: మల్లెల గురవయ్య, కవి. మదనపల్లె రచయితల సంఘం (మరసం) స్థాపకుడు. (మ.2016)
1965: కృష్ణ భగవాన్, తెలుగు చలనచిత్ర హాస్య నటుడు, రచయిత.
1965: జయలలిత, చలన చిత్ర నటి.
1968: గౌతమి తెలుగు, తమిళ సినిమా నటి.

మరణాలు


1566: నోస్ట్రడామస్, ఫ్రాన్సుకు చెందిన జ్యోతిష్కుడు, ప్రవక్త.
1644: విలియం గేస్కోయిన్, ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మైక్రోమీటర్ ఆవిష్కర్త. (జ.1612)
1843: శామ్యూల్ హనెమాన్, హొమియోపతీ వైద్యశాస్త్ర పితామహుడు. (జ.1755)
1961: హెమింగ్వే, సాహిత్యములో నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1899)
1982: చెరబండరాజు, విప్లవ కవి. (జ.1944)
1995: గడ్డం రాంరెడ్డి, దూరవిద్య ప్రముఖులు, సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు". (జ.1929)
2002: దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు. (జ.1933)
2005: పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (జ.1923)


పండుగలు , జాతీయ దినాలు
ప్రపంచ క్రీడా జర్నలిస్ట్ ల దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి: