ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని తీవ్ర స్థాయిలో వ‌ణికిపోతున్న విష‌యం తెలిసిందే. కంటి క‌నిపించ‌ని క‌రోనా.. అటు ప్ర‌జ‌లకు, ఇటు ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ క్ర‌మంలోనే రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,09,85,656 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,24,088 మంది మృతి చెందారు. దీంతో ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో అర్థంగాక ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక ఈ ప్రాణాంత‌క క‌రోనా ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది.

 

ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు పోగొట్టుకుని.. రోడ్డున ప‌డుతున్నారు. అలాగే మ‌రి కొంద‌రు క‌రోనా కార‌ణంగా కుటుంబాన్ని పోషించ‌లేక అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 47 ఖాళీలను ప్రకటించింది. గార్డెనర్ (తోటమాలి) పోస్టుల్ని భర్తీ చేస్తోంది.  అభ్యర్థులకు గార్డెనింగ్‌తో పాటు పువ్వులు అల్లడంలో అనుభవం ఉండాలి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. 5వ తరగతిఅనుభవం మ‌రియు గార్డెనింగ్‌లో 2 ఏళ్ల అనుభవం ఉండాలి.

 

 కడప జిల్లాలోని టీటీడీ ఆలయాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల్లో 75% పోస్టులు కడప జిల్లా వాసులకే రిజర్వ్ చేసింది టీటీడీ. మిగిలిన పోస్టుల్ని ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేయొచ్చు. ఇక ఈ పోస్టుల‌కు ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. దరఖాస్తుకు 2020 జూలై 20 చివరి తేదీ. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tirumala.org/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ను ఇదే వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను.

మరింత సమాచారం తెలుసుకోండి: