భారతీయ రైల్వే ఉద్యోగాల భర్తీని నిలిపివేస్తుందన్న వార్తలు నిరుద్యోగులను షాక్ కి గురి చేస్తోంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొత్త పోస్టుల్ని సృష్టించొద్దంటూ భారతీయ రైల్వే నియామక సంస్థ అయిన రైల్వే బోర్డు నుంచి రైల్వే జనరల్ మేనేజర్లకు అధికారికంగా లేఖ వెల్లడించారు. దింతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారిందన్నారు.

 

 

కరోనా ప్రభావం రైల్వే శాఖపై కూడా భారీగానే పడింది. రైల్వే ఆదాయం మునుపటి కంటే 58 శాతం తగ్గింది. దీంతో ఉద్యోగాల భర్తీ విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రత విభాగంలో పోస్టులు మినహా మిగతా విభాగాల్లో పోస్టుల మంజూరు, భర్తీ ప్రక్రియ నిలిపివేసింది.

 

 

రైల్వేలో ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొత్త పోస్టుల్ని సృష్టించొద్దని, గత రెండేళ్లలో సృష్టించిన పోస్టుల్ని సమీక్షించాలని, ఒకవేళ ఆ పోస్టులకు నియామకాలు చేపట్టకపోతే సరెండర్ చేయాలన్నది ఆ లేఖ సారాంశం.

 

 

అయితే రైల్వే భద్రత విభాగాలకు ఇది వర్తించదని ఆ లేఖలో ఉంది. దీంతో రైల్వే ఉద్యోగాల భర్తీపై, ఇప్పటివరకు రిలీజ్ అయిన నోటిఫికేషన్లపై గందరగోళం నెలకొంది. దీనిపై భారతీయ రైల్వే క్లారిటీ ఇచ్చింది. రైల్వే కార్యకలాపాలు, నిర్వహణకు కావాల్సిన సేఫ్టీ కేటగిరీ పోస్టుల్ని సరెండర్ చేయట్లేదని ఇండియన్ రైల్వేస్ సామాజిక మాధ్యమంలో వివరించింది.

 

 

నాన్ సేఫ్టీ కేటగిరీలో ఖాళీగా ఉన్న పోస్టుల్ని మాత్రమే సమీక్షించి, సేఫ్టీ కేటగిరీలో కొత్త పోస్టుల్ని సృష్టిస్తామని, దీని ద్వారా రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో వీరిని నియమిస్తామని రైల్వే తెలిపింది. ప్రస్తుతం వేర్వేరు కేటగిరీల్లో కొనసాగుతున్న నియామక ప్రక్రియల్ని పూర్తి చేస్తామని తెలిపింది.

 

 

కొత్త పోస్టుల నిలిపివేయడం, వర్క్‌షాపుల్లోని ఉద్యోగులను హేతుబద్ధీకరించడం, ఖర్చు తగ్గించడం, డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ను ఎక్కువగా వినియోగించుకోవడం ద్వారా నష్టాల నుండి గట్టెక్కాలని రైల్వే శాఖ భావిస్తోంది. కొత్త నోటిఫికేషన్లు నిలిపివేయడంతో దాదాపు 15 వేల ఉద్యోగాలకు రెడ్‌ సిగ్నల్‌ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: