ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌ని క‌రోనా చైనాలో పుట్టి.. అన‌తి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించి. ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌లాది మంది క‌రోనా కాటుకు బ‌లైపోతున్నారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. భారత్‌లో కూడా కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మరణాల సంఖ్య త్రీవ స్థాయిలో పెరుగుతోంది. వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో దీని తీవ్ర‌త మ‌రింత ఎక్కువ‌గా ఉంది. ఇక కరోనా వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 

 

అనేకమంది శాస్త్రవేత్తలు ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. అయితే మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరిగిపోతోంది. దీంతో చాలా మంది రోడ్డున ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్-NCERT ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో 266 ఖాళీలు ప్ర‌క‌టించింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. 

 

ఈ నోటిఫికేష‌న్‌లోని ఖాళీల వివ‌రాలు ప‌రిశీలిస్తే..  మొత్తం ఖాళీలు 266 ఉండ‌గా.. అందులో ప్రొఫెసర్- 38, అసోసియేట్ ప్రొఫెసర్- 83, అసిస్టెంట్ ప్రొఫెసర్- 142, లైబ్రేరియన్- 1 మ‌రియు అసిస్టెంట్ లైబ్రేరియన్- 2 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే.. రూ.1000 ఫీజు చ‌ల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఇప్ప‌టికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ స్టాట్ అయింది. దరఖాస్తు చేయడానికి 2020 ఆగస్ట్ 3 చివరి తేదీ. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అధికారిక వెబ్‌సైట్ http://www.ncert.nic.in/  ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: