గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూలై 9వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1875 - బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్ స్థాపించబడింది.
1969 - భారత వన్యప్రాణి బోర్డు, పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది.


జననాలు

1866: పానగల్ రాజా, కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (మ.1928)
1876: టేకుమళ్ళ రాజగోపాలరావు, విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, రచయిత.
1918: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (మ.2007)
1920: తమ్మారెడ్డి సత్యనారాయణ, భారత కమ్యూనిష్టు పార్టీ నేత. (మ.)
1925: గురుదత్, భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (మ.1964)
1926: బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2018)
1927: గుమ్మడి వెంకటేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు. (మ.2010) తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు . తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఇతను 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఇతను చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.
1938: సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (మ.1985)
1958: బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్‍కు చెందిన రాజకీయ నాయకుడు.
1966: ఉన్నికృష్ణన్, శాస్త్రీయ సంగీత, సినీ గాయకుడు.
1969: వెంకటపతి రాజు, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1970: అనురాధ శ్రీరామ్, గాయని.


పండుగలు , జాతీయ దినాలు

అర్జెంటీనా - జాతీయదినోత్సవం

మరింత సమాచారం తెలుసుకోండి: