గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూలై 11 వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

 

1921: పానగల్ రాజా మద్రాసు ప్రెసిడెన్సీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
1966: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇంగ్లాండులో ప్రారంభమయ్యాయి.
1987: ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది.

 

జననాలు


1767: జాన్ క్విన్సీ ఆదమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1877: అలీ నవాజ్ జంగ్ బహదూర్, హైదరాబాదుకు చెందిన ఇంజనీరు. (మ.1949) మీర్ అహ్మద్ అలీ, నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదుర్. తెలంగాణ నీటిపారుదల పితామహుడిగానూ, తెలంగాణ ఆర్థర్ కాటన్‌గా అభివర్ణించబడిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఇంజనీరు. అప్పటి హైదరాబాదు రాజ్యంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, నిర్మించాడు.
1907: సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (మ.1963)
1920: యూలి బోరిస్వొవిచ్ బ్రినెర్, హాలీవుడ్ నటుడు (మ. 1985 అక్టోబరు 10)
1946: రామకృష్ణ (చిత్రకారుడు), వ్యంగ్య చిత్రకారుడు, కార్టూనిస్ట్‌.
1964: మణిశర్మ, తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు.

మరణాలు

 

2007: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (జ. 1939) సూరపనేని శ్రీధర్ (డిసెంబర్ 21, 1939 - జూలై 11, 2007) తెలుగు సినిమా నటుడు. మూడు దశకాల పాటు సాగిన సినీ ప్రస్థానంలో సుమారు 150 సినిమాలలో నటించిన శ్రీధర్ తెలుగు సినిమా రంగములో ముత్యాల ముగ్గు సినిమాతో గుర్తింపు పొందాడు.


పండుగలు , జాతీయ దినాలు

 

మంగోలియా జాతీయ దినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవం

మరింత సమాచారం తెలుసుకోండి: