సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI భారతదేశ వ్యాప్తంగా మొత్తం 147 ఆఫీసర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతుంది. ఈ జనరల్, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్‌లో గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల ఉద్యోగాలకి నెలకు జీతాలు Rs. 28,150 - Rs. 55,600/- ఇస్తామని ప్రకటనలో పేర్కొన్నది. ఉద్యోగం వచ్చిన తర్వాత అభ్యర్థులకు భారత దేశ వ్యాప్తంగా ఎక్కడైనా డ్యూటీ పడే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగానికి 2020 జులై 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


నిజానికి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడో ముగిసిపోయింది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దరఖాస్తు గడువును పెంచేసింది. అభ్యర్థులు తమకిష్టమైన 3 ఎగ్జామినేషన్ సెంటర్లను ఫేజ్(Phase) వన్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫేజ్ 2 లో ఒక ఎగ్జామినేషన్ సెంటర్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఫేజ్ 1, ఫేజ్ 2 లలో వేర్వేరు ఎగ్జామినేషన్ సెంటర్ ల పేర్లు రాయాల్సి ఉంటుంది. ఏం  పరీక్ష కేంద్రాలు ఒకసారి తెలుసుకుంటే... ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూల్, రాజమండ్రి, గుంటూరు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ ఉన్నాయి.  


ఈ విపత్కర సమయాల్లో అభ్యర్థులు రిస్కు చేసి తమ డబ్బులు పెట్టుకొని రావాల్సి ఉంటుంది. పరీక్షకి హాజరైనప్పుడు కరోనా వైరస్ సోకితే తమ బాధ్యత కాదని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. విద్య అర్హత వివిధ పోస్టులకు వివిధ రకాల అర్హత ఉండాల్సి ఉంటుంది. వయోపరిమితి ఫిబ్రవరి 29,  2020 నాటికి 30 సంవత్సరాలు ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ​https://www.sebi.gov.in/​​​ ని విజిట్ చేయండి.



Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: