ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలు క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు విల‌విల‌లాడిపోతున్న విష‌యం తెలిసిందే. ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్.. మాన‌వుల ప్రానాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది. వ్యాక్సిన్ లేని ఈ క‌రోనా కాటుకు ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. భారత్‌లో కూడా కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇక మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య కూడా విప‌రీతంగా పెరిగిపోతోంది.

 

అయితే ఇలాంటి స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్ వైధ్య విధాన పరిషత్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 723 ఖాళీల ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వాటి వివ‌రాలు ప‌రిశీలిస్తే.. మొత్తం ఖాళీలు  723  ఉండగా అందులో గైనకాలజీ- 333, పీడియాట్రిక్స్- 38, అనస్థీషియా- 105, జనరల్ మెడిసిన్- 37, జనరల్ సర్జరీ- 29, ఆర్థోపెడిక్స్- 31, ప్యాథాలజీ- 24, ఆప్తమాలజీ- 27, రేడియాలజీ- 27, సైకియాట్రి- 7, డెర్మటాలజీ- 11, ఈఎన్‌టీ- 23, డెంటల్ అసిస్టెంట్ సర్జన్- 31 పోస్టులున్నాయి.

 

పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ, బీడీఎస్ పాసైనవారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎంపికైన వారికి రూ.53,500 జీతం లభిస్తుంది. ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు  2020 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఇప్ప‌టికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్ర‌రంభ‌మైంది. దరఖాస్తుకు జూలై 18 ఆఖ‌రు తేదీ. కాగా, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కమిషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మిషన్ అధికారిక వెబ్‌సైట్‌ http://cfw.ap.nic.in/ ఓపెన్ చేసి చూసుకోవ‌చ్చు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిపికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని.. వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను.

 

మరింత సమాచారం తెలుసుకోండి: