ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వికృత‌రూపం దాల్చుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌ల మంది క‌రోనా కాటుకు బ‌లైపోతున్నారు. ఇంకెంద‌రో ఈ వైర‌స్ బారిన ప‌డి నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. వ్యాక్సిన్ లేని ఈ క‌రోనా చైనాలో పుట్టి.. ఇప్పుడు ప్ర‌పంచ‌దేశాల‌కే స‌వాల్ విసురుతోంది. ఇక వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా ముప్పు తప్పదని తేల‌డంతో.. యావత్ ప్రపంచం వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అయితే క‌రోనా వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందో అర్థంకాని ప‌రిస్థితి.

 

అయితే ఇలాంటి స‌మ‌యంలో నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెబుతూ డీఆర్‌డీఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగాలకు భ‌ర్తీ చేస్తూ.. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 311 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పోస్టుల‌కు దరఖాస్తు గడువు జూలై 10న అంటే నేటితో ముగుస్తుంది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అప్లై చేయలేనివారికి మరో అవకాశం ఇచ్చింది డీఆర్‌డీఓ. ఆగస్ట్ 17 వరకు గడువు పొడిగించింది. 

 

ఇక పోస్టుల వివ‌రాలు చూస్తే.. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 311 ఖాళీలు ఉండ‌గా.. అందులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 81, మెకానికల్ ఇంజనీరింగ్- 82, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 60, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 12, మెటల్లార్జీ- 10, ఫిజిక్స్- 14, కెమిస్ట్రీ- 7, కెమికల్ ఇంజనీరింగ్- 11, ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 17, సివిల్ ఇంజనీరింగ్- 3, మ్యాథమెటిక్స్- 4 మ‌రియు సైకాలజీ- 10 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. మ‌రియు గేట్, నెట్ స్కోర్ ఉండాలి. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు  నెలకు రూ.80,000 జీతం ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rac.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: