ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. ఈ ప్రాణాంత‌క వైర‌స్ దెబ్బ‌కు దేశ‌దేశాల‌ ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అవుతున్నారు. వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. దీంతో క‌రోనా పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నారు. మ‌ర‌ణాల సంఖ్య కూడా అంత‌కంత‌కూ రెట్టింపు అవుతున్నాయి. దీంతో  కరోనా వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అనేకమంది శాస్త్రవేత్తలు ఈ పనిలోనే రాత్రి, పగలు అని తేడా లేకుండా తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

 

అయితే మ‌రోవైపు కరోనా వేళ ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తోంది. తాజాగా విడుద‌లైన నోటిఫికేష‌న్‌లో 311 పోస్టుల భర్తీ చేస్తోంది. స్టాఫ్ నర్స్, రిసిప్షనిస్ట్ కమ్ క్లర్క్, ల్యాబ్ టెక్నీషియన్ లాంటి పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

 

ఖాళీల వివ‌రాలు చూస్తే.. మొత్తం 311 పోస్టులు ఉండ‌గా.. అందులో చైల్డ్ సైకాలజిస్ట్- 1, స్టాఫ్ నర్స్- 28+250, రిసిప్షనిస్ట్ కమ్ క్లర్క్- 3, ల్యాబ్ టెక్నీషియన్- 04, ఫార్మాసిస్ట్- 2, డార్క్ రూమ్ అసిస్టెంట్- 1, ఫీమేల్ నర్స్ ఆర్డర్లీ- 10, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్- 2 మ‌రియు మేల్ నర్సింగ్ ఆర్డర్లీ- 10 ఖాళీలు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టులు. ఈ పోస్టుల‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ద‌ర‌ఖాస్తుకు 2020 జూలై 18 ఆఖ‌రి తేదీ. ఈ నోటిఫికేషన్ పూర్తి వివ‌రాల కోసం https://eastgodavari.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాలంటే రూ.300  దరఖాస్తు ఫీజు చ‌ల్లించాల్సి ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: