గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూలై 13వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు
1930: మొదటి ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఉరుగ్వే లో ప్రారంభమయ్యాయి.


జననాలు


1915: గుత్తి రామకృష్ణ, కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009)గుత్తి రామకృష్ణ రాయలసీమ కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాకులలో ఒకడు. బ్రిటీష్ హయాంలోనే స్వతంత్రభారత్, ఆకాశవాణి పత్రికలకు జిల్లా సమస్యల గురించి వ్యాసాలు, వార్తలు వ్రాస్తూ ప్రజా సమస్యలను ప్రతిబింబింప జేసేవాడు. ప్రజాశక్తి, విశాలాంధ్ర, దక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, జనశక్తి, ఉజ్జ్వల, జనత మొదలైన పత్రికలకు తొలి విలేఖరిగా పనిచేశాడు. దాదాపు 70 సంవత్సరాలు పత్రికా విలేఖరిగా పనిచేశాడు. భారత బంజార సంఘం ప్రోత్సాహంతో బంజారా పత్రికను అనంతపురం నుండి రెండేళ్లపాటు సంపాదకుడిగా ఉండి నడిపాడు. జనప్రభ దినపత్రికకు కూడా సంపాదకుడిగా పనిచేశాడు.

1924: హీరాలాల్ మోరియా, పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (మ.2006) ఖమ్మం జిల్లాలో హిందీ, ఉర్దూ, తెలుగు బాషల అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ, అంజుమన్ తహఫుజ్ ఉర్దూ సంస్థలను స్థాపించడంతో పాటు రాష్ట్రంలో ఉర్దూ ద్వితీయ భాష గుర్తింపుకై ఎంతో కృషి చేశారు. ఖమ్మం జిల్లాలో పెక్కు పత్రికలకు విలేకరిగా పనిచేసిన మోరియా, కొలిపాక మధుసూదనరావు గారితో కలిసి ఒక సంవత్సరం పాటు మా భూమి పత్రికను నడిపారు. ఖమ్మం జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించి ఆ సంస్థ తరపున యాభై గ్రంథాలను ప్రచురించడం కూడా అపూర్వమే. దీనితో పాటు లలిత కళల అభివృద్ధి కోసం ‘భారతీయ కళాపరిషత్తు”ను కూడా స్థాపించారు. మోరియా దాదాపు పది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి సభ్యులుగా వుండి, సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. అదేవిధంగా పది సంవత్సరాల పాటు ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థకు అధ్యక్షులుగా ఉన్నారు. సాహిత్యం పట్ల – సాహిత్య ఉద్యమాల పట్ల ఆసక్తిగా ఉండేవారు.

1941: టి. కల్పనాదేవి, పార్లమెంటు సభ్యురాలు.
1964: ఉత్పల్ చటర్జీ, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1987: అజ్మల్ కసబ్, పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాది. (మ.2010)

మరణాలు

2013: కోడి సర్వయ్య, నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాటయోధుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: