గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూలై 14వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం

 

ముఖ్య సంఘటనలు


2015 - గోదావరి పుష్కరాల ప్రారంభదినం సందర్భంగా, రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించడానికి వచ్చిన జనాలలో ఏర్పడిన త్రొక్కిసలాటలో 27 మంది చనిపోయారు.

 

జననాలు


1794: మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించారు. (మ.1868)
1857: మేటాగ్, వాషింగ్ మెషిన్ (బట్టలు ఉతికే యంత్రం) ని కనిపెట్టిన శాస్త్రవేత్త.
1860: పూండ్ల రామకృష్ణయ్య, తెలుగు పండితుడు, విమర్శకుడు. (మ.1904)
1862: ఫ్లోరెన్స్ బాస్కం, మొట్టమొదటి పి.హెచ్‌డి పొందిన అమెరికన్ మహిళ.
1893: గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.1952)
1904: వెంపటి సూర్యనారాయణ, ప్రజావైద్యుడు, గాంధేయవాది. (మ.1993)
1918: ఇంగ్మార్ బెర్గ్మాన్, స్వీడిష్ దర్శకుడు. (మ.2007)
1920: శంకర్‌రావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (మ.2004).
1950: గ్రంధి మల్లికార్జున రావు, వ్యాపారవేత్త.
1956: తనికెళ్ళ భరణి, రంగస్థల, సినిమా రచయిత, నటుడు.
1959: చాగంటి కోటేశ్వరరావు, అనితర సాధ్యమైన ధారణ పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి
1975: పంకజ్ భడౌరియా, 2010లో జరిగిన మాస్టర్ షెఫ్ ఇండియా మొదటి సీజన్ విజేత.

 

మరణాలు


1958: కింగ్ ఫైజల్ II, ఇరాక్ రాజు (జ.1935).
2015: ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. (జ.1928) తెలుగు, తమిళ, మలయాళం మొదలైన భాషల్లో దాదాపు పన్నెండువందల సినిమాలకు సంగీతాన్ని అందించారు. 14 జూలై 2015న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: