ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. ఈ ప్రాణాంత‌క వైర‌స్ దెబ్బ‌కు దేశ‌దేశాల‌ ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అవుతున్నారు. వ్యాక్సిన్ లేని ఈ క‌రోనా చైనాలో పుట్టి.. ఇప్పుడు ప్ర‌పంచ‌దేశాల‌కే స‌వాల్ విసురుతోంది. ఇక వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా ముప్పు తప్పదని తేల‌డంతో.. యావత్ ప్రపంచం వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అయితే క‌రోనా వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందో అర్థంకాని ప‌రిస్థితి. అయితే పదో తరగతి పాసయినా విద్యార్థులకు ఇంతక ముందు ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించేవారు. అయితే తాజాగా తెలంగాణలో జూనియర్ కాలేజీలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

 

 

తాజాగా తెలంగాణలోని టెన్త్ విద్యార్థులకు తెలంగాణలోని గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే టెన్త్ విద్యార్థులకు మరో అవకాశం లభించింది. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్‌ కాలేజెస్‌ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TSRJC CET) 2020 పరీక్షకు దరఖాస్తు గడువును ఆగస్టు 5, 2020 వరకు పొడిగించారని అధికారులు వెల్లడించారు.

 

 

అయితే ఈ పరీక్ష ద్వారా గురుకుల కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం (ఇంగ్లిష్‌ మీడియం-ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ)లో ప్రవేశాలు పొందొచ్చునని తెలియజేశారు. అయితే ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 5వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు వెల్లడించారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత TREIS ఎంట్రెన్స్ టెస్ట్ తేదీని ప్రకటించనుందని అధికారులు వెల్లడించారు.

 

 

అయితే తాజాగా తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాల కోసం TSRJC CET 2020 జరగనుందని అధికారులు వెల్లడించారు. అయితే తెలంగాణలో మొత్తం 35 కాలేజీల్లో 20 బాలికల కాలేజీలు, 15 బాయ్స్ కాలేజీలు ఉన్నాయని ఈ సందర్బంగా తెలియజేశారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://tsrjdc.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చునని ఉన్నత స్థాయి అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: