ప్ర‌స్తుతం క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని ప్ర‌పంచ‌దేశాలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకున్న క‌రోనా ఇంకెంత మందిని పొట్ట‌న‌పెట్టుకుంటుందో అర్థం కావ‌డం లేదు. ఇక వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. ఈ ప్రాణాంత‌క వైర‌స్‌ దూకుడుకు అడ్డుక‌ట్ట పడ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ ప్రాణాంత‌క క‌రోనా ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు పోగొట్టుకుని.. రోడ్డున ప‌డుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్ బ్యూలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

 

ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 292 ఖాళీలు ఉన్నాయి.సెక్యూరిటీ ఆఫీసర్, రీసెర్చ్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భ‌ర్తి చేస్తోంది. వాటి వివ‌రాలు చూస్తే.. మొత్తం ఖాళీలు 292 ఉండ‌గా.. అందులో డిప్యూటీ డైరెక్టర్ / టెక్- 2, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్- 2, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్- 1, సెక్యూరిటీ ఆఫీసర్ (టెక్నికల్)- 6, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్/టెక్- 10, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-1 / ఎగ్జిక్యూటీవ్- 54, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-2 / ఎగ్జిక్యూటీవ్- 55, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (టెక్నికల్)- 12, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (జనరల్)- 10,పర్సనల్ అసిస్టెంట్- 10 పోస్టులు ఉన్నాయి.

 

వీటిలో పాటు..జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- 1 / ఎగ్జిక్యూటీవ్- 26, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- 1 (మోటార్ ట్రాన్స్‌పోర్ట్)- 12, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- 2 (మోటార్ ట్రాన్స్‌పోర్ట్)- 12, సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్)- 15, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (గన్‌మెన్)- 24, రీసెర్చ్ అసిస్టెంట్- 1, అకౌంటెంట్- 24, ఫీమేల్ స్టాఫ్ నర్స్- 1, కేర్ టేకర్- 4 మ‌రియు హల్వాయ్ కమ్ కుక్- 11 పోస్టులు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మూంది. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది 2020 ఆగస్ట్ 19. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ https://www.mha.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: