క‌రోనా వైర‌స్‌.. ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. కంటి క‌నిపించ‌కుండానే ల‌క్ష‌ల ప్రాణాలు హ‌రించేస్తోంది. మ‌రోవైపు కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అనేకమంది శాస్త్రవేత్తలు ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఫ‌లితం రాక‌పోవ‌డంతో.. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. భార‌త్‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

 

మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. అయితే ఇలాంటి స‌మ‌యంలో  నార్త్ సెంట్రల్ రైల్వే ఉద్యోగాల‌ను భ‌ర్తి చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి.  ఈ నోటిఫికేష‌న్‌లో 196 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. వీటి వివ‌రాలు చూస్తే.. మొత్తం 196 పోస్టుల్లో  ఫిట్టర్- 90, వెల్డర్- 50, మెకానిక్ మెషీన్ అండ్ టూల్స్ మెయింటనెన్స్- 13, మెషినిస్ట్- 12, ఎలక్ట్రీషియన్- 12, స్టెనోగ్రాఫర్ (హిందీ)- 3 ఖాళీలు ఉన్నాయి.

 

విద్యార్హ‌త విష‌యానికి వ‌స్తే..  50% మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. అదే స‌మ‌యంలో అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న‌వాళ్లు మాత్ర‌మే ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. ఇక ఈ  పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ద‌ర‌ఖాస్తు చేయడానికి 2020 జూలై 15 చివరి తేదీ. అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని.. వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉత్తర మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ https://ncr.indianrailways.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: