ప్ర‌స్తుతం కంటికి క‌నిపించ‌ని క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఎలాంటి మందు లేదు. ఎప్పుడు వ‌స్తుందో కూడా అర్థంకావ‌డం లేదు. ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు క‌రోనా వ్యాక్సిన్ క‌నుగొనేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ త‌గిన ఫ‌లితం ద‌క్క‌డం లేదు. ఈ క్ర‌మంలోనే క‌‌రోనా జోరుకు అడ్డుక‌ట్ట ప‌డ‌డం లేదు. దీంతో ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోతారు అర్థంకావ‌డం లేదు.

 

అయితే మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య సైతం భారీగా పెరిగిపోతుంది. ఇలాంటి స‌మ‌యంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 789 ఖాళీలను ప్రకటించింది. కానిస్టేబుల్, ఇన్‌స్పెక్టర్, ఎస్ఐ లాంటి పోస్టులు ఉన్నాయి. పూర్తి వివ‌రాలు చూస్తే.. మొత్తం ఖాళీలు 789 ఉండ‌గా.. అందులో ఇన్‌స్పెక్టర్- 1, సబ్ ఇన్‌స్పెక్టర్- 183, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్- 157, 
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ / ఎలక్ట్రోకార్డియోగ్రఫీ టెక్నీషియన్- 1, హెడ్ కానిస్టేబుల్- 197 మ‌రియు కానిస్టేబుల్- 250 ఖాళీలు ఉన్నాయి.

 

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ పోస్టుల‌కు రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, దరఖాస్తుల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 20న ప్రారంభం కానుంది. అలాగే దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2020 ఆగస్ట్ 31. రూ. 200 ద‌ర‌ఖాస్తు ఫీజు చ‌ల్లించాల్సి ఉంటుంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సీఆర్‌పీఎఫ్‌ అధికారిక వెబ్‌సైట్ https://www.crpf.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: