ప్రస్తుతం దేశంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. మీరు పోలీస్ కావాలి అనుకుంటున్నారా..? ఇంకా ఎందుకు ఆలస్యం ఈ నోటిఫికేషన్ కి అప్లయ్ చేసుకోండి. తాజగా పోలీసులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-CRPF ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్, ఇన్‌స్పెక్టర్, ఎస్ఐ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 789 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 20న ప్రారంభం కానుంది.

 

 

దరఖాస్తు చేయడానికి 2020 ఆగస్ట్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సీఆర్‌పీఎఫ్‌ అధికారిక వెబ్‌సైట్ https://www.crpf.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని, ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో చివరి తేదీలోగా పంపాల్సి ఉంటుంది.

 

 

మొత్తం ఖాళీలు 789 ఖాళీలు ఉన్నాయి. అయితే అందులో ఇన్‌స్పెక్టర్- 1, సబ్ ఇన్‌స్పెక్టర్- 183, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్- 157, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ / ఎలక్ట్రోకార్డియోగ్రఫీ టెక్నీషియన్- 1, హెడ్ కానిస్టేబుల్- 197, కానిస్టేబుల్- 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 

 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 2020 జూలై 20 నుండి 2020 ఆగస్ట్ 31 వరకు చివరి గడువు. పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన రాతపరీక్ష 2020 డిసెంబర్ 20 నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగానికి వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు ఫీజు రూ.200 చెల్లించాలన్నారు. పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, న్యూఢిల్లీ, గువాహతి, జమ్మూ, ప్రయాగ్ రాజ్, అజ్మేర్, నాగ్‌పూర్, ముజాఫర్‌పూర్, పల్లీపురంలో నిర్వహించనున్నారు. ఎంపిక విధానం రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, దరఖాస్తుల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: