ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ క‌రోనా విశ్వ‌రూపం చూపిస్తూ.. ప్ర‌జ‌ల‌కు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎంద‌రో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. మ‌రెంద‌రో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క‌రోనా మ‌హ‌మ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ అందుబాటులో లేక‌పోవ‌డంతో.. అడ్డు అదుపులేకుండా విస్త‌రిస్తోంది. ఇక క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్‌తో ఓ వైపు ఉపాధి దెబ్బ‌తింది, ఉన్న ఉద్యోగం గ్యారంటీ లేదు, ఇప్ప‌టికే చాలా మంది నిరుద్యోగుల‌కు మారి రోడ్డున ప‌డుతున్నారు. 

 

అయితే ఇలాంటి త‌రుణంలో నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ అందించి నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లాంచ్ చేసింది. మైనింగ్ సిర్దార్, సర్వేయర్, అకౌంటెంట్, జూనియర్ కెమిస్ట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 495 ఖాళీలను ప్రకటించింది. వీటి పూర్తి వివ‌రాలు చూస్తే.. మొత్తం ఖాళీలు 495 ఉండ‌గా.. మైనింగ్ సిర్దార్- 88, సర్వేయర్ (మైనింగ్)- 7, అకౌంటెంట్ / కాస్ట్ అకౌంటెంట్ టెక్ గ్రేడ్ ఏ- 41, ఓవర్సీర్ గ్రేడ్ సీ- 35, అమిన్ గ్రేడ్ డీ- 10, జూనియర్ కెమిస్ట్- 7, డ్రాగ్‌లైన్ ఆపరేటర్ (ట్రైనీ)- 9, డోజర్ ఆపరేటర్ (ట్రైనీ)- 48, గ్రేడర్ ఆపరేటర్ (ట్రైనీ)- 11 పోస్టులు ఉన్నాయి.

 

వీటితో పాటు డంపర్ ఆపరేటర్ (ట్రైనీ)- 167, షోవెల్ ఆపరేటర్ (ట్రైనీ)- 28, పే లోడర్ ఆపరేటర్ (ట్రైనీ)- 6, క్రేన్ ఆపరేటర్ (ట్రైనీ)- 21, డ్రిల్ ఆపరేటర్ (ట్రైనీ)- 17 పోస్టులు కూడా ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూలై 17న ప్రారంభం కానుంది. అలాగే ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి ఆఖ‌రి తేది జూలై 23. ఇక  ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://nclcil.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని.. ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: