విచ్చిలవిడిగా వెలిసిన ఇంజినీరింగ్ కళాశాలు... ఫీజు రీఎంబర్స్ మెంట్ పుణ్యమా అని భారీగా చేరుతున్న విద్యార్థులు వెరసి.. ఏటా లక్షలమంది ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసుకుని రోడ్లపైకి వస్తున్నారు. అయితే నాసిరకమైన విద్యాబోధన కారణంగా వీరు ఉపాధి అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు. 

 

IHG


ఈ లోపాన్ని సరిదిద్దేందుకు  తెలంగాణ సర్కారు ప్రయత్నిస్తోంది. తాజాగా తెలంగాణలో 50 వేల మంది నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఓ అమెరికా సంస్థతో ఒప్పదం కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఆన్‌లైన్‌ సంస్థ కోర్సెరాతో తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌.. టాస్క్‌.. ఒప్పందం కుదుర్చుకుంది. 

 

IHG


క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా సైన్స్‌, బ్లాక్‌చెయిన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కృత్రిమ మేధ వంటి 3,800 కోర్సుల్లో కోర్సెరా సంస్థ తెలంగాణ విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ పూర్తయ్యాక సర్టిఫికెట్లు ఇస్తారు. ఈ ట్రైనింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారు సెప్టెంబరు 30వ తేదీ లోపు పేరు నమోదు చేసుకోవచ్చు.

www.coursera.org/government/workforce  ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలి. 

 

IHG


కోర్సెరా సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 60 మిలియన్ల మందికి ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ ఇచ్చిన ట్రాక్  రికార్డు ఉంది. ప్రపంచంలోని 100కిపైగా ఫార్చ్యూన్‌ సంస్థలు, 2,300 కంపెనీలు, 200కి పైగా విశ్వవిద్యాలయాలతో కోర్సెరా భాగస్వామి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: