వైజాగ్ లోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్..వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాదాపు 319 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా..ఫిట్టర్ , మెషిన్స్ట్ ..మొదలగు విభాగాలలో నియామకాలు చేపడుతున్నారు.

Jobs

ట్రేడులు:  ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, డ్రాట్స్‌మ్యాన్ (మెకానిక్), వెల్డర్, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, ఆర్ అండ్ ఏసీ, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పీఏఎస్‌ఏఏ.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ (ఎన్‌సీవీటీ) ఉత్తీర్ణత. 

వయసు: ఫిబ్రవరి 1, 2019 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. 

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్. ముందుగా ఆన్‌లైన్ ద్వారా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఆఫ్‌లైన్ దరఖాస్తు నింపి నేరుగా లేదా పోస్టులో పంపాలి. 

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 20, 2019. (నేరుగా అయితే ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో సమర్పించవచ్చు).

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.vizagsteel.com



మరింత సమాచారం తెలుసుకోండి: