భారత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలలో ఒకటైన ఇండియన్ నేవీ 172 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా  చార్జ్‌మ్యాన్ (గ్రూప్-బి) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులని కోరుతోంది.

 Current Affairs

విభాగాల వారీ ఖాళీలు..

చార్జ్‌మ్యాన్ (మెకానిక్): 103.

అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలో రెండేళ్ల పాటు డిజైన్/ప్రొడక్షన్/మెయింటెన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎక్విప్‌మెంట్/సిస్టమ్ వంటి విభాగాల్లో క్వాలిటీ కంట్రోల్/క్వాలిటీ అష్యూరెన్స్/ టెస్టింగ్/ప్రూఫ్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.

చార్జ్‌మ్యాన్ (అమ్యూనిషన్ అండ్ ఎక్స్‌ప్లోజివ్) : 69 

అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలో రెండేళ్ల పాటు కెమికల్ ఇంజనీరింగ్/ప్రాసెసింగ్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్/క్వాలిటీ అష్యూరెన్స్/ టెస్టింగ్/ప్రూఫ్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.

వయసు: 2019, ఏప్రిల్ 28 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.205. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఉచితం. 

ఎంపిక:   దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తులు ప్రారంభం:     ఏప్రిల్ 16, 2019.

దరఖాస్తుకు చివరితేదీ:     ఏప్రిల్ 28, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:   www.joinindiannavy.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: