అందరికీ ఉద్యోగాలు ఇచ్చే భారత ప్రభుత్వ సంస్థ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.. యూ పీ ఎస్సీ.. ఇప్పుడు ఈ యూపీఎస్సీ కేంద్ర కార్యాలయంలోనే ఉద్యోగాలకు అవకాశం వచ్చింది. యూపీఎస్సీ ఈ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

యూపీఎస్సీలో మొత్తం 41 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిలో జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌-02, సైంటిస్ట్‌-38, ఎకనమిస్ట్‌-01 గా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హతలు.. పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

 

ఈ ఉద్యోగాలకు అనుభవం కూడా పరిశీలిస్తారు. రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ మార్చి 12, 2020న ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.

 

 

ఈ సమాచారం మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: