రైల్వే జాబ్ అంటే అదో గౌరవం, భరోసా.. చిన్న ఉద్యోగమైనా సరే రైల్వే వంటి సంస్థలో సంపాదించాలని చాలా మంది కోరుకుంటారు. ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ వచ్చేసింది. ఈస్టర్న్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 2792 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

 

10వ తరగతి పాసై సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు కూడా ఉంటుంది.

 

ఇక ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం ఖాళీలు- 2792

 

ఫిట్టర్- 1070

వెల్డర్-547

మెకానిక్ (ఎంవీ)- 9

మెకానిక్ (డీజిల్)- 123బ్లాక్‌స్మిత్- 9

మెషినిస్ట్- 74

కార్పెంటర్ -20

పెయింటర్- 26

లైన్‌మ్యాన్- 49

వైర్‌మ్యాన్- 67

రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్- 54

ఎలక్ట్రీషియన్- 593

మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్- 9

ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 75

టర్నర్- 67

 

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 4

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు http://www.rrcer.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: