ఎన్‌ఐటీల్లో సీటు పొందిన విద్యార్థులు అడ్మిషన్‌ సమయంలో కచ్చితంగా అడ్మిట్‌ కార్డును అందజేయాల్సి ఉంటుంది. అడ్మిట్‌ కార్డు లేనిపక్షంలో అడ్మిషన్‌ ఇవ్వరు. విద్యార్థులు అడ్మిట్‌ కార్డును జాగ్రత్తగా భద్రపరచుకోవాలని అధికారులు సూచించారు. ఏవరైనా అడ్మిట్‌ కార్డు పోగొట్టుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంబంధిత విద్యార్థులు రూ. 1000 డీడీ జత చేసి దరఖాస్తును జోనల్‌ ఐఐటీ కేంద్రానికి పోస్టు చేయాలని తెలిపారు. అధికారులు విద్యార్థి వివరాలను పరిశీలించి డూప్లికేట్‌ అడ్మిట్‌ కార్డును పంపిస్తారని వెల్లడించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న జోసా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: