ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతిక ప్రగతికి పెద్ద పీట వేస్తున్నారు.  ప్రతి ఒక్కరూ విద్యావంతులైన ఏపీని ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ స్థానంలోకి తీసుకు వచ్చేలా యువత కృషి చేయాలని అంటున్నారు.  ఇక తిరుపతిలో ఎంతో గొప్ప పేరు సాధించిన  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్దులు ప్రవేశం పొందారు. నేపాల్ కు చెందిన ప్రత్యూష్ రాజ్ శ్రేష్ట ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రవేశం పొందారు.  
Image result for sri venkateswara university
ఈ మేరకు ప్రవేశ పత్రాన్ని ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య మల్లికార్జున విదేశీ వ్యవహారల విభాగం డీన్ ఆచార్య సుదర్శనం తదితర ఉన్నతాధికారులు నేపాల్ విద్యార్థికి అందజేశారు.  ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మల్లికార్జున మాట్లాడుతూ ఎస్వీయు ఇంజనీరింగ్ కళాశాలకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్నాయన్నారు.  దీంతో విదేశీ విద్యార్థులు సైతం ఇక్కడ విద్యాభాస్యం చేయడానికి మక్కువ చూపుతున్నారని పేర్కొన్నారు.  

డీన్ ఆచార్య సుదర్శనం మాట్లాడుతూ వీసీ ఆచార్య దామోదరం అదేశానుసారం ప్రతి విభాగంలో విదేశీ విద్యార్థులకు అయిదు శాతం సీట్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు.  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎస్వీయూ ఎనలేని ప్రగతిని సాధిస్తుండటంతో విదేశీ విద్యార్థులు ఎస్వీయూలో విద్యాభ్యాసం చేయడానికి ముందుకొస్తున్నారుని తెలియజేశారు. విదేశీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో అంతర్జాతీయ స్థాయి బోధన, వసతి కల్పిస్తామని ఆచార్య సుదర్శనం పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో పలువురు అధికారుల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: