తెలంగాణలో అందరికీ విద్యనందించే దిశగా విద్యాశాఖ ముందడుగు వేస్తుంది.  ఈ మేరకు దూర విద్యా విధానంలో ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 17న నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.   ఇక 2017–18 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను ఈ నెల 17 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిం చనున్నట్లు ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ వెల్లడించింది.
Image result for దూర విద్యా విధానంలో ఓపెన్‌
అభ్యర్థులు మీసేవా/టీఎస్‌ ఆన్‌లైన్‌/ఏపీ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి నమోదు చేసుకోవాలని, దరఖాస్తు ఫారాన్ని అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ఇక వచ్చే నెల 4 వ తేదీ వరకు దీనికి సంబంధించిన  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Image result for దూర విద్యా విధానంలో ఓపెన్‌
ఒకవెళ ఆలస్యంగా చెల్లించినట్లయితే.. నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని, వారంతా మీసేవా ద్వారా మాత్రమే వచ్చే నెల 21వ తేదీలోగా దరఖాస్తులను పంపించాలని వెల్లడించింది. పూర్తి వివ రాలు జిల్లాల్లోని డీఈవో కార్యాలయాలు లేదా telanganaopenschool.org వెబ్‌సైట్‌లో పొందవచ్చని వివరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: