తెలంగాణలో నిరుద్యోగులకి ఈ మధ్య వరుసగా నోటిఫికేషన్లు పడుతున్నాయి..ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకి తెలంగాణా ప్రభుత్వం అవకాశాలని కలిపిస్తుండటంతో విద్యార్ధులు నిరుద్యోగులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో విద్యుత్ సంస్థల్లో ఉన్న ఖాలీలకి కి నోటిఫికేషన్ జారీ చేయనున్నారని వెల్లడించారు..తెలంగాణ విద్యుత్ సంస్థల్లో  సుమారుగా ఖాళీగా ఉన్న 600 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ) పోస్టులను భర్తీ చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి.


 తెలంగాణ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ట్రాన్స్‌కో), దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్‌), ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్‌)ల్లో ఈ మేరకు ఖాళీ ఏఈ పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోంది.ఈ మూడు సంస్థలలో ఉన్న ఖాళీలు అన్నిటికీ  ఉమ్మడిగా ఒకే నోటిఫికేషన్‌ జారీ కానుంది.విద్యుత్‌ సంస్థల వారీగా ఎలక్ట్రికల్‌, సివిల్‌, మెకానికల్‌, ఐటీ విభాగాల్లో ఏఈ పోస్టుల ఖాళీలను గుర్తించి భర్తీ చేసేందుకు కసరత్తును ముమ్మరం చేశారు.

 

 రెండేళ్ల కిందట జారీ చేసిన 1427 ఏఈ పోస్టుల నియామక ప్రక్రియ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే భర్తీ అయిన విషయం తెలిసిందే..ఇప్పుడు వాటిలో భర్తీకాకుండా మిగిలిపోయిన పోస్టులతో పాటు ఖాళీగా ఉన్నవి కలుపుకొని 600 ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేయనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: