విదేశాల్లో చదువుకోవాలి..ఆర్ధికంగా నిలబడాలి అనుకున్న పేద బీసీ,ఎస్సీ,ఎస్టీ  మరియు మైనారిటీ విద్యార్ధులకి తెలంగాణా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది..ఇంతకు ముందు ఉన్న ఓవర్సీస్‌ విద్యానిధి పథకాని మార్పులు చేర్పులు చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు విదేశాలలో ఉన్న విద్యార్ధులకి ఒక వరం అనే చెప్పాలి

 Related image

 

విదేశాలలో విధ్యనభ్యసించే పేద బీసీ,ఎస్సీ,ఎస్టీ  మరియు మైనారిటీ విద్యార్ధులకి ఆదాయ పరిమితిని పెంచుతూ సుమారు 2 లక్షల నుండీ 5 లక్షలకు పెంచుతున్నట్టుగా కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు.మైనారిటీ సంక్షేమంపై చర్చ సందర్భంగా ఈ విషయం తెలిపారు. అయితే.. సంక్షేమశాఖ అధికారులు గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. ఈ పథకం అర్హత నిబంధనలకు సంబంధించి గత జీవోలోని కొన్ని అంశాలకి కీలకమైన మార్పులు చేశారు. విద్యార్ధులు ఈ పధకం ద్వారా పడిన కొన్ని ఇబ్బందులని ద్రుష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్టుగా కేసీఆర్ తెలిపారు.

 

4 పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం 2నుంచి 3లక్షలకు పెంపు.

 

బీటెక్‌ పూర్తిచేసిన చాలా మంది ఉద్యోగులు పథకానికి దరఖాస్తు చేసుకోగా వారి వార్షికాదాయం రూ.2లక్షలకు మించడంతో వారికి అనుమతి ఇవ్వలేదు.ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన ఈ వార్త అలాంటి వారికి ఊరట ఇవ్వనుంది.

 

విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశాల్లో ఆంగ్ల భాషా పరిజ్ఞానం కోసం నిర్వహించే ఐఈఎల్‌టీఎ్‌సలో 6 పాయింట్లు వస్తే అర్హులుగా పరిగణిస్తారు.

 

టోఫెల్‌లో- 6పాయింట్లు, 260 - జీఆర్‌ఈ..జీమ్యాట్‌లో- 500  మార్కులు సాధించాలి.

 

డిగ్రిలో వచ్చిన మార్కులకు 60శాతం, జీఆర్‌ఈ/జీమ్యాట్‌మార్కులకు 20,ఐఈఎల్‌టీఎ్‌స/టోఫెల్‌లో వచ్చిన పాయింట్లకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.

 

అమెరికా, ఆస్ర్టేలియా, జర్మనీ, న్యూజిలాంగ్‌, జపాన్‌కెనడా, సింగపూర్‌యూకే, , , ఫ్రాన్స్‌, దక్షిణాఫ్రికాల్లో ప్రఖ్యాత వర్సిటీల్లో సీట్లు పొందినా పథకం వర్తిస్తుంది.

 

బీసీలకోసం ఏర్పాటు చేసిన విధ్యానిది లో ఈబీసీలకు 5శాతం సీట్లు కేటాయించింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: