ఆర్ఆర్‌సీ(రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్)  - సెంట్రల్ రైల్వేలో  2196 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేశారు.  సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసిన‌వాళ్లు ఈ భర్తీకి అర్హులు..పదవ తరగతిలో వచ్చిన మార్కుల ద్వారా అలాగే  ఐటీఐలో సాధించిన మార్కుల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు.ఎంచుకున్న విభాగం బట్టి  అప్రెంటిస్ సమయం ఎంత అనేది ఉంటుంది..అప్రెంటిస్‌గా చేరిన‌వారికి ఎంపిక చేసుకున్న విధంగా స్టైపెండ్ చెల్లిస్తారు.

 central railway 600 width logo కోసం చిత్ర ఫలితం

క్లస్టర్ల వారీ ఖాళీల సమాచారం - నాగ్‌పూర్‌-107, , ముంబ‌యి -1503 , పుణే-151, , షోలాపూర్‌-94. భుసావాల్ -341

విభాగాలు:  డీజిల్ మెకానిక్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, వెల్డర్, మెషినిస్ట్‌, టైల‌ర్‌, పెయింట‌ర్‌, ఫిట్టర్‌, కార్పెంట‌ర్‌, ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్‌, టూల్ & డై మేక‌ర్‌, మెకానిక్ (మోటార్ వెహికిల్), ట‌ర్నర్‌, షీట్ మెట‌ల్ వ‌ర్కర్‌, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్‌, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌, ప్రోగ్రామింగ్ & సిస్టమ్స్ అడ్మినిస్ట్రేష‌న్ అసిస్టెంట్‌.

అర్హత‌:  క‌నీసం 50 శాతం మార్కుల‌తో ప‌దోత‌ర‌గ‌తిలో ఉత్తీర్ణత సాధించాలి. సంభందిత విభాగాలలో సర్టిఫికెట్ ఉండాల.

వ‌యోప‌రిమితి:  01.11.2017 నాటికి 15 - 24 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే న‌వంబ‌రు 1, 1988 - న‌వంబ‌రు 1, 2002 మ‌ధ్య జ‌న్మించాలి...ఓబీసీలు న‌వంబ‌రు 1, 1990 - న‌వంబ‌రు 1, 2002 మ‌ధ్య జ‌న్మించిన‌వాళ్లు అర్హులు:  జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే న‌వంబ‌రు 1, 1993 - న‌వంబ‌రు 1, 2002 మ‌ధ్య జ‌న్మించిన‌వాళ్లు అర్హులు.

 

ఎంపిక విధానం:  ప‌దోత‌ర‌గ‌తిలో సాధించిన మార్కులు, ఐటీఐ ట్రేడ్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ రెండింటికీ స‌మ ప్రాధాన్యం ఉంటుంది. మెరిట్‌, రిజ‌ర్వేష‌న్ ప్రాతిప‌దిక‌న నియామ‌కాలు చేప‌డ‌తారు.
ఎంపికైతే: ఎంపికైన‌వారికి అప్రెంటీస్‌గా తీసుకుంటారు. అభ్యర్థి ట్రేడ్‌ను బ‌ట్టి ఏడాది లేదా రెండేళ్లు అప్రెంటీస్‌గా కొన‌సాగుతారు. ఈ స‌మ‌యంలో స్టైపెండ్ చెల్లిస్తారు. అప్రెంటీస్ ద్వారా రైల్వే ఉద్యోగానికి ఎలాంటి హామీ ఉండ‌దు. అయితే ఈ అప్రెంటీస్ శిక్షణ‌తో నైపుణ్యాలు పెంపొందించుకోవ‌చ్చు. దీంతో భ‌విష్యత్తులో సంబంధిత ట్రేడ్‌ల్లో ల‌భించే ఉద్యోగాల‌ను పొంద‌డం సులువ‌వుతుంది. కొన్ని ట్రేడ్‌ల్లో స్వయం ఉపాధి ద్వారా రాణించే అవ‌కాశాలు ఉన్నాయి. విలువైన ప‌ని అనుభ‌వానికి అప్రెంటీస్ విధానం దోహ‌ద‌ప‌డుతుంది.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఫీజు: రూ.100.

 

ఆన్‌లైన్లో  ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 01.11.2017.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 30.11.2017 (సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు)

 


మరింత సమాచారం తెలుసుకోండి: