డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ).. 59 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డబ్ల్యూఐఐ.. కేంద్ర పర్యావరణ,mariyu avtaaevఅటవీ, వాతావరణ మార్పు శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ.ఖాళీగా ఉన్న పోస్టుల  వివరాలు : ప్రాజెక్ట్ పేరు కి తెక్క్ఫ్హ ... అసోసియేట్-2; సీనియర్ బయాలజిస్ట్-5; రీసెర్చ్ బయాలజిస్ట్-50 (ఫీల్డ్ కంపోనెంట్-45+జీఐఎస్ కంపోనెంట్-2+ జెనెటిక్ కంపోనెంట్-3); ప్రాజెక్ట్ బయాలజిస్ట్-2. 

 Image result for వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

అర్హతలు:   సంబంధిత పోస్టులను అనుసరించి పీహెచ్‌డీ/ఎంఎస్సీ/బీఈ/ బీటెక్/బీఎస్సీ/పీజీ/పీజీ డిప్లొమా. అలాగే నిబంధనల మేర మార్కుల శాతం, ఉద్యోగానుభవం తదితరం ఉండాలి. 

వయసు :  ప్రాజెక్ట్ అసోసియేట్‌కు 40 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ. 

రాతపరీక్ష విధానం: దీన్ని 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో పోస్టులను బట్టి 25 మార్కులకు జనరల్ ఎకాలజీ, కన్జర్వేషన్ బయాలజీ/జీఐఎస్ రిమోట్ సెన్సింగ్/ కన్జర్వేషన్ జెనెటిక్స్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. మిగిలిన 25 మార్కులకు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ ఎకాలజీ (అన్ని పోస్టులకూ) నుంచి ప్రశ్నలు వస్తాయి. రాతపరీక్షను అర్హత పరీక్షగా గణిస్తారు. ఇందులో నిర్దేశిత మార్కులు పొందిన అభ్యర్థులను మెరిట్ జాబితా ప్రకారం ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 

రాతపరీక్ష కేంద్రాలు:  డెహ్రాడూన్, జైపూర్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, గువాహటి, లక్నో, భోపాల్, ఢిల్లీ/ఎన్‌సీఆర్, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్, చండీగఢ్, కోయంబత్తూరు, తిరువనంతపురం, రాంచి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ-రూ.100; మిగిలిన అభ్యర్థులకు రూ.750.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2017. 

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.wii.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: