సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్).. 487 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్..సుమారు ౩౦౦ ఇండస్ట్రీస్ ని కవర్ చేస్తూ ఉంటుంది..కేంద్ర ప్రభుత్వానికి సంభందించిన అనేక సంస్థలలో రక్షణకి గాను వీరిని ఉపయోగిస్తారు.ఇప్పుడు ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చేస్తున్న భార్తీలు ఇండియాలో అనేక ప్రాంతాల వారికి కూడా అవకాశాన్ని కలిపిస్తున్నాయి.

Image result for cisf recruitment 2017

పోస్టు పేరు:  కానిస్టేబుల్/ఫైర్.

వేతనం:   రూ.21,700-రూ.69,100.

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీ ఖాళీలు: 

ఆంధ్రప్రదేశ్-34; అరుణాచల్‌ప్రదేశ్-4; అసోం-28; బిహార్-69; ఛత్తీస్‌గఢ్-16; ఢిల్లీ-4; గుజరాత్-15; హర్యానా-6; హిమాచల్‌ప్రదేశ్-2; జమ్ముకశ్మీర్-12; జార్ఖండ్-28; కర్ణాటక-16; కేరళ-8; మధ్యప్రదేశ్-19; మహారాష్ట్ర-29; మణిపూర్-3; మేఘాలయ-3; మిజోరం-1; నాగాలాండ్-1; ఒడిశా-29; పంజాబ్-7; రాజస్థాన్-17; తమిళనాడు-17; తెలంగాణ-28; త్రిపుర-4; ఉత్తరప్రదేశ్-53; ఉత్తరాఖండ్-2; పశ్చిమబెంగాల్-32. వీటిలో 155 పోస్టులను ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని నక్సల్స్/తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేకంగా కేటాయించారు.
అర్హతలు:   సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 
వయసు:  దరఖాస్తు గడువు ముగిసేనాటికి 18-23 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు సడలింపు ఉంటుంది. 
శారీరక ప్రమాణాలు: 

ఎత్తు-కనీసం 170 సెం.మీ.; ఛాతీ-కనీసం 80 సెం.మీ. (సాధారణం)-85 సెం.మీ. (గాలిపీల్చినపుడు); ఎస్టీ అభ్యర్థులైతే ఎత్తు-కనీసం 162.5 సెం.మీ., ఛాతీ-కనీసం 77 సెం.మీ. (సాధారణం)-82 సెం.మీ. (గాలిపీల్చినపుడు). అన్ని కేటగిరీల అభ్యర్థులకూ వారి ఎత్తు, వయసును బట్టి వైద్య ప్రమాణాలకు అనుగుణంగా బరువు ఉండాలి. 

ఆరోగ్య ప్రమాణాలు: 

నిబంధనల మేర తగిన శారీరక, మానసిక ఆరోగ్యం, దృష్టి సామర్థ్యం ఉండాలి. టాటూ (పచ్చబొట్లు) ఉండకూడదు. 
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(దేహ దారుఢ్య పరీక్ష): ఇందులో 5 కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహిస్తారు. దీన్ని 24 నిమిషాల్లో పూర్తిచేయాలి.

ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), రాతపరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్. 
రాతపరీక్ష: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ)లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అనంతరం రాతపరీక్ష (ఓఎంఆర్ ఆధారిత) నిర్వహిస్తారు. ఇందులో ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రంలో జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ ఆప్టిట్యూడ్, ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ప్యాటర్స్న్‌తోపాటు ఇంగ్లిష్/హిందీ సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. 

దరఖాస్తు ఫీజు: రూ. 100 (జనరల్/ఓబీసీ); ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికోద్యోగ కేటగిరీలకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్.

దరఖాస్తుల ప్రారంభం:  డిసెంబర్ 11, 2017.

దరఖాస్తుకు చివరి తేదీ:  జనవరి 1, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.cisfrectt.in


మరింత సమాచారం తెలుసుకోండి: