ఎంతో మంది విద్యార్ధులకి గొప్ప మేధాశక్తి ఉంటుంది..చదువుకోవాలనే తపన ఉంటుంది..వారు ఎంచుకున్న రంగంలో దూసుకుపోయే శక్తి ఉంటుంది..గుండెల నిండా ఆత్మ స్థైర్యం ఉంటుంది కానీ ఆర్ధిక బలం ఉండదు..పేద కుటుంభాలు కానీ మధ్యతరగతి కుటుంభాల విద్యార్ధుల పరిస్థితి ఇదే..అందరికీ తెలిసిన విషయమే అందుకే దేశంలో చదువుకునే విద్యార్ధుల కోసం ఎన్నో సంస్థలు వాళ్ళ వాళ్ళ రంగాలకి తగ్గట్టుగా ఆయా వ్రుత్తి నైపుణ్య కోర్సులు చేసే వాళ్లకి.. స్కాలర్‌షిప్స్ అందిస్తున్నారు

 Image result for l and t build india scholarship

అందులో భాగంగానే “ఎల్ అండ్ టీ” కన్‌స్ట్రక్షన్ కంపెనీ.. కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఎంటెక్ చదవబోయే అభ్యర్థుల నుంచి ‘బిల్డ్ ఇండియా స్కాలర్‌షిప్స్’ కోసం దరఖాస్తులు కోరుతోంది.

 

స్టైపెండ్:  రూ.13,400; స్పాన్సర్‌షిప్ ఫీజు, ట్యూషన్ ఫీజులను విద్యార్థి చదివే ఐఐటీ/ఎన్‌ఐటీ సంస్థకు నేరుగా చెల్లిస్తారు. 

అర్హతలు:  కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కోర్ సివిల్/కోర్ ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత. 

ఎంపిక విధానం:  ఆన్‌లైన్ పరీక్ష (సబ్జెక్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు); ఇంటర్వ్యూ. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. 

దరఖాస్తు చివరి తేదీ:  డిసెంబర్ 27, 2017. 

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:    www.lntecc.com


మరింత సమాచారం తెలుసుకోండి: