తెలంగాణా రాష్ట్రలో ఎంతో మంది విద్యార్ధులు..ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు చేసి..చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ..ప్రైవేటు హాస్పిటల్స్ లో పని చేసుకుంటున్నారు..అయితే తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు ఈ కోర్సులు చేసిన వారికి తీపి కబురు చెప్పింది..

 

టీఎస్‌పీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) రిక్రూట్‌ 2018 నోటిఫికేషన్ తన అధికారిక వెబ్ సైట్ ద్వారా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 200 ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఉద్యోగార్థులు డిసెంబర్ 23, 2017 నుంచి జనవరి 24, 2018 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

 

కమిషన్ పేరు:  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ)

 

పోస్టు పేరు:   ల్యాబ్ టెక్నీషియన్

 

ఖాళీల సంఖ్య:  200

 

జాబ్ లొకేషన్:  తెలంగాణ

 

చివరి తేదీ: జనవరి 24, 2018

 

జీతం వివరాలు:  రూ. 21,230 - 67,990/-

 

విద్యార్హత:  యూనివర్సిటీ, పారా-మెడికల్ బోర్డ్ఏపీ/టీఎస్ నుంచి గుర్తింపు పొందిన సంస్థ నుంచి డీఎంఎల్టీతో ఇంటర్మీడియట్ లేదా బీఎస్సీ(ఎంఎల్టీ) కలిగివుండాలి.

 

వయో పరిమితి:  01.07.2017 నాటికి 18-44ఏళ్ల మధ్య ఉండాలి.

 

ముఖ్యమైన తేదీలు:

 

రిజిస్ట్రేషన్ల ప్రారంభతేదీ: 23.12.2017

రిజిస్టేషన్‌కు చివరి తేదీ : 24.01.2018

 


మరింత సమాచారం తెలుసుకోండి: