కేంద్ర హోంశాఖ పరిధిలో ఉండే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్)లో మోటార్ మెకానిక్ విభాగంలో ఖాళీగా ఉన్న సుమారు “241”  గ్రూప్ ‘సి’ కేటగిరీ కొలువుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువడింది.

Image result for indo tibetan border police

ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు :   హెడ్ కానిస్టేబుల్-60 (అన్‌రిజర్వుడ్-23+ఓబీసీ (ఎన్‌సీఎల్)- 22+ఎస్సీ-12+ఎస్టీ-3); కానిస్టేబుల్-181 (అన్‌రిజర్వుడ్-85+ఓబీసీ (ఎన్‌సీఎల్)-48+ఎస్సీ-31+ఎస్టీ-17).

విభాగం:   మోటార్ మెకానిక్.

వేతనశ్రేణి:  హెడ్ కానిస్టేబుల్ రూ.25,500-రూ.81,100; కానిస్టేబుల్- రూ.21,700-రూ.69,100. 

అర్హతలు:  హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియెట్/తత్సమాన ఉత్తీర్ణత. అలాగే మోటార్ మెకానిక్‌లో సర్టిఫికెట్/ఐటీఐతో పాటు ఏదైనా వర్క్‌షాప్‌లో కనీసం మూడేళ్ల ప్రాక్టికల్ అనుభవం (లేదా) ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా; కానిస్టేబుల్ పోస్టుల కు పదోతరగతి/తత్సమాన విద్యలో ఉత్తీర్ణత. అలాగే సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్/ఏదైనా సంస్థలో మూడేళ్ల ఉద్యోగానుభవం. 

వయసు:  దరఖాస్తు గడువు ముగిసే నాటికి 18-25 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్తిస్తుంది. 
శారీరక ప్రమాణాలు (ఫిజికల్ స్టాండర్డ్స్): ఎస్టీ అభ్యర్థులకు ఎత్తు-162.5 సెం.మీ., ఛాతీ 76 (సాధారణం)-81 (గాలి పీల్చిన పుడు) సెం.మీ.; మిగిలిన అభ్యర్థులకు ఎత్తు-170 సెం.మీ., ఛాతీ 80 సెం.మీ. (సాధారణం)-85 (గాలి పీల్చినపుడు) సెం.మీ. ఉండాలి. అలాగే అన్ని కేటగిరీల అభ్యర్థులకూ ఎత్తు, వయసుకు అనుగుణంగా బరువు ఉండాలి. దీంతోపాటు తగిన దృష్టి సామర్థ్యం తప్పనిసరి. అలాగే టాటూ (పచ్చబొట్లు) ఉండకూడదు. 

ఎంపిక:   ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ), రాతపరీక్ష, ప్రాక్టికల్ (స్కిల్) టెస్ట్. 
దేహ దారుఢ్య పరీక్ష (ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్: పీఈటీ): ఇందులో పరుగుపందెం-1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల 30 సెకన్లలోపు పరిగెత్తగలగాలి. అలాగే లాంగ్ జంప్-11 అడుగుల దూరాన్ని మూడు అవకాశాల్లో, హై జంప్- మూడున్నర అడుగుల ఎత్తును మూడు అవకాశాల్లోగా అధిగమించాలి. 
ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ): పీఈటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల శారీరక ప్రమాణాలు పరిశీలించి, నిబంధనల మేర ఉంటే రాతపరీక్షకు ఎంపిక చేస్తారు. 

రాతపరీక్ష:   దీన్ని ఆబ్జెక్టివ్ విధానంలో ఓఎంఆర్ ఆధారంగా నిర్వహిస్తారు. మొత్తం 50 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 10, మ్యాథమెటిక్స్ నుంచి 5, హిందీ నుంచి 10, ఇంగ్లిష్ నుంచి 10, ట్రేడ్‌కు సంబంధించి 15 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం గరిష్ట మార్కులు 50. హెడ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రశ్నలు ఇంటర్మీడియెట్ స్థాయిలో, కానిస్టేబుల్ అభ్యర్థులకు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. పరీక్ష వ్యవధి గంట. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో మాత్రమే ఉంటుంది. 

ప్రాక్టికల్ (స్కిల్) టెస్ట్:  ఇందులో నాలుగు అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వెహికల్ ఇన్‌స్పెక్షన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫాల్ట్స్, రెక్టిఫికేషన్ ఆఫ్ డిఫెక్ట్స్ అంశాల్లో ఒక్కో దాన్నుంచి 15 చొప్పున 45 ప్రశ్నలు ఇస్తారు. మిగిలిన 5 ప్రశ్నలు హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్ నుంచి ఉంటాయి. గరిష్ట మార్కులు 50. ఈ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (డీఎంఈ) నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుం:   జనరల్/ఓబీసీ-రూ.100; ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికోద్యోగ కేటగిరీలకు ఫీజు లేదు. 
దరఖాస్తు విధానం:   ఆన్‌లైన్. 
దరఖాస్తుల ప్రారంభం:  జనవరి 2, 2018.
దరఖాస్తు చివరి తేదీ:  జనవరి 31, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:     www.recruitment.itbpolice.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: