క్రీడలలో చక్కగా రాణించగలిగి.. శారీరకంగా ఎంతో ధృడంగా ఉండేవారికి స్పోర్ట్స్ కోటా విభాగంలో ఇండియన్ నేవీలో స్పోర్ట్స్ కోటా ఎంట్రీ-01/2018 బ్యాచ్ ద్వారా సెయిలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువడింది.

 Image result for sports quota jobs indian navy

పోస్టు పేరు:  సెయిలర్.

వేతనం:  శిక్షణలో స్టైపెండ్ రూ.14,600. కోర్సు విజయవంతంగా పూర్తయ్యాక రూ.21,700-రూ.43,100 వేతన శ్రేణిలో నియమితులవుతారు.

అర్హతలు:  డెరైక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్‌కు ఇంటర్మీడియెట్/తత్సమాన విద్యతోపాటు ఏదైనా క్రీడాంశంలో టీమ్ విభాగంలో అంతర్జాతీయ/జాతీయ/రాష్ట్ర/ ఇంటర్‌యూనివర్సిటీ స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. అలాగే ఏదైనా క్రీడాంశంలో వ్యక్తిగత విభాగంలో జాతీయ స్థాయి పోటీల్లో సీనియర్ కేటగిరీలో కనీసం 6వ స్థానం/జూనియర్ కేటగిరీలో కనీసం 3వ స్థానం/ఇంటర్‌యూనివర్సిటీ పోటీల్లో కనీసం 3వస్థానం పొంది ఉండాలి. వయసు 17-22 ఏళ్ల లోపు ఉండాలి. 

సీనియర్ సెకండరీ రిక్రూట్‌మెంట్ (ఎస్‌ఎస్‌ఆర్)కు ఇంటర్మీడియెట్/తత్సమాన విద్యతోపాటు ఏదైనా క్రీడాంశంలో అంతర్జాతీయ/జాతీయ/రాష్ట్ర/ఇంటర్‌యూనివర్సిటీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. వయసు 17-21 ఏళ్ల లోపు ఉండాలి.

మెట్రిక్ రిక్రూట్స్ (ఎంఆర్)కు పదోతరగతి/తత్సమాన విద్యతోపాటు ఏదైనా క్రీడాంశంలో అంతర్జాతీయ/జాతీయ/రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. వయసు 17-21 ఏళ్ల లోపు ఉండాలి.

 

శారీరక ప్రమాణాలు (మెడికల్ స్టాండర్డ్స్):  ఎత్తు-157 సెం.మీ.; ఛాతీ-తగినంత ఉండి గాలిపీల్చినపుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించగలగాలి. బరువు తగినంత ఉండాలి. అలాగే నేవీ నిబంధనల మేర తగిన శారీరక, మానసిక ఆరోగ్యం, దృష్టి సామర్థ్యం తదితర అర్హతలుండాలి. టాటూ (పచ్చబొట్లు) ఉండకూడదు.

ఎంపిక:  క్రీడాంశాల్లో ప్రతిభ, మెడికల్ స్టాండర్డ్స్. 

దరఖాస్తు విధానం:  ఆఫ్‌లైన్. 

దరఖాస్తు చేరడానికి చివరి తేదీ:  జనవరి 15, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.joinindiannavy.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: