తెలంగాణా రాష్ట్రం ఎంతో మంది నిరుద్యోగుల కోసం..ఎప్పటికప్పుడు వివిధ శాఖలలో ఉద్యోగ నియామకాలు చేపడుతూ వస్తోంది..అందులో భాగంగానే..ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ ట్రాన్స్‌కో).. 1,604 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మూడు వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది.

పోస్టు-ఖాళీలు:  జూనియర్ లైన్‌మ్యాన్ (జేఎల్‌ఎం)-1,100; సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)-174; అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)-330 (ఎలక్ట్రికల్-250+ సివిల్-49+టెలికాం-31).
వేతనశ్రేణి: జేఎల్‌ఎం-రూ.15,585-రూ.25,200; సబ్ ఇంజనీర్/ఎలక్ట్రికల్-రూ.20,535-రూ.41,155;ఏఈ-రూ.41,155-రూ.63,600. 
Image result for ts transco office

అర్హతలు:  జేఎల్‌ఎంకు పదోతరగతి/తత్సమాన విద్యతోపాటు ఎలక్ట్రికల్/వైర్‌మ్యాన్ ట్రేడ్‌లో ఐటీఐ. లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో రెండేళ్ల ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్స్; సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)కు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ/డిప్లొమా/తత్సమాన విద్య; ఏఈకి సంబంధిత విభాగాలను అనుసరించి ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/సివిల్/ టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ/ఏఎంఐఈ ఎగ్జామినేషన్‌లో సెక్షన్ ‘ఎ’, సెక్షన్ ‘బి’ ఉత్తీర్ణత/తత్సమాన విద్యలో ఉత్తీర్ణత.

వయసు:  జేఎల్‌ఎంకు 18-35 ఏళ్ల లోపు; సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), ఏఈ పోస్టులకు 18-44 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేర గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక:   రాతపరీక్ష. 

రాతపరీక్ష విధానం: 

 

జేఎల్‌ఎం, సబ్ ఇంజనీర్ పోస్టులకు 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో రెండు సెక్షన్లు ఎ, బి ఉంటాయి. సెక్షన్ ‘ఎ’లో 65 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో జేఎల్‌ఎంకు ఐటీఐ, సబ్ ఇంజనీర్‌కు డిప్లొమా ట్రేడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ ‘బి’లో జనరల్ అవేర్‌నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ రెండు పోస్టులకూ ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో 15 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు.

ఏఈ పోస్టులకు రాతపరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో నిర్వహిస్తారు. ఇందులోనూ రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ‘ఎ’లో సంబంధిత విభాగం నుంచి 80 ప్రశ్నలు, సెక్షన్ ‘బి’లో జనరల్ అవేర్‌నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు.

 

గమనిక: జేఎల్‌ఎం పో స్టుల అభ్యర్థులకు పోల్/టవర్ క్లైంబింగ్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైతేనే ఉద్యోగానికి ఎంపికచేస్తారు. 

దరఖాస్తు రుసుం:  రూ.220 (అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ-రూ.100+ఎగ్జామినేషన్ ఫీ-రూ.120); ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. 
ముఖ్యమైన తేదీలకోసం పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   tstransco.cgg.gov.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: