ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్ లో ఉద్యోగ నియామకాలకి నోటిఫికేషన్ పడింది..చెన్నై లోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)కు చెందిన పవర్ సెక్టార్-సదరన్ రీజియన్ విభాగం.. 25  ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.

Image result for bhel chennai

ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ (ఎఫ్‌టీఏ-సివిల్)-12; సూపర్‌వైజర్(ఎఫ్‌టీఏ-సివిల్)-13.

వేతనం: ఎగ్జిక్యూటివ్-రూ.54,060; సూపర్‌వైజర్-రూ.26,920.

అర్హతలు: ఎగ్జిక్యూటివ్‌కు కనీసం 60 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం) మార్కులతో సివిల్‌లో బీఈ/బీటెక్/ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/డ్యూయల్ డిగ్రీతోపాటు సంబంధిత రంగంలో కనీసం ఐదేళ్ల ఉద్యోగానుభవం; సూపర్‌వైజర్‌కు కనీసం 60 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం) మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమాతోపాటు సంబంధిత రంగంలో కనీసం ఐదేళ్ల ఉద్యోగానుభవం. 

వయసు: 2018, జనవరి 1 నాటికి 37 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లు వర్తిస్తాయి.

ఎంపిక: అభ్యర్థుల సంఖ్యను బట్టి రాతపరీక్ష/ఇంటర్వ్యూ.

దరఖాస్తు రుసుం: రూ.200; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ కేటగిరీకి ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకొని దరఖాస్తు హార్డ్‌కాపీ ప్రింటవుట్లు, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లతో కలిపి పంపాలి. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 17, 2018.

హార్డ్‌కాపీ చేరడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 1, 2018. 

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:    www.bhelpssr.co.incareers.bhel.in


మరింత సమాచారం తెలుసుకోండి: