యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) (త్రివిధ ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్) దళాల్లోని సుమారు 415 పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.. ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ(ఎన్డీఏ అండ్ ఎన్ఏ) ఎగ్జామినేషన్(1)-2018’  ఈ ప్రకటన విడుదల చేసింది...ఎంపికైన అభ్యర్థులకు ఎన్‌డీఏ 141వ కోర్సు, 103వ ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సు(ఐఎన్‌ఏసీ) ద్వారా శిక్షణ ఇచ్చి వారే నియామకం కలిపిస్తారు..

Image result for upsc
మొత్తం ఖాళీలు:  415. ఇందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ) ద్వారా 360(ఆర్మీ-208, నేవీ-60, ఎయిర్‌ఫోర్స్-92) పోస్టులు; నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ద్వారా 55 పోస్టులను భర్తీ చేస్తారు. 

వేతనం:  శిక్షణలో స్టైపెండ్-రూ.56,100; ఉద్యోగంలో నియమితులయ్యాక ప్రారంభ హోదాలో-రూ.56,100-రూ.1,77,500. 

వయస్సు:  అభ్యర్థులు 1999 జూలై 2-1 జూలై, 2002 మధ్య జన్మించి ఉండాలి. 

అర్హతలు:  ఆర్మీ పోస్టులకు.. ఇంటర్మీడియెట్/తత్సమాన విద్య; ఎయిర్‌ఫోర్స్, నేవీ పోస్టులకు.. ఫిజిక్స్,మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్/తత్సమాన విద్యలో ఉత్తీర్ణత. తుది సంవత్సరం విద్యార్థులూ అర్హులే. 

శారీరక ప్రమాణాలు(ఫిజికల్ స్టాండర్డ్స్):  ఎత్తు-ఆర్మీ, నేవీ పోస్టులకు కనీసం 157 సెం.మీ, ఎయిర్‌ఫోర్స్ పోస్టులకు కనీసం 162.5 సెం.మీ; అలాగే అన్ని పోస్టుల అభ్యర్థులకూ ఛాతీ తగినంత ఉండి, గాలి పీల్చినపుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించగలగాలి. దీంతోపాటు ఎత్తు, వయస్సుకు అనుగుణంగా బరువు ఉండాలి. అలాగే తగిన శారీరక, మానసిక ఆరోగ్యం, వినికిడి, దృష్టి సామర్థ్యం తప్పనిసరి. పచ్చబొట్లు(టాటూ)లను అనుమతించరు. 

ఎంపిక:  రాతపరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్ట్/ఇంటర్వ్యూ. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ టెస్ట్ ఉంటుంది. ఇందులో సైకలాజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉంటాయి. 

రాతపరీక్ష విధానం:  దీన్ని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో మ్యాథమెటిక్స్ నుంచి 300 మార్కులకు ప్రశ్నలిస్తారు. వ్యవధి రెండున్నర గంటలు. రెండో భాగంలో జనరల్ ఎబిలిటీ టెస్ట్ 600 మార్కులకు ఉంటుంది. వ్యవధి రెండున్నర గంటలు. రెండు భాగాలూ కలిపి గరిష్ఠ మార్కులు 900. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో మాత్రమే ఉంటుంది. రాతపరీక్షలో నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణులైన వారి మెరిట్ జాబితా నుంచి ఎస్‌ఎస్‌బీ టెస్ట్స్ అండ్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 

ఎస్‌ఎస్‌బీ టెస్ట్స్ అండ్ ఇంటర్వ్యూ:  ఇది రెండు దశల్లో ఉంటుంది. స్టేజ్-1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ (ఓఐఆర్) టెస్ట్స్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షిన్ టెస్ట్(పీపీ అండ్ డీటీ) ఉంటాయి. స్టేజ్-2లో ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్స్, సైకాలజీ టెస్ట్స్, కాన్ఫరెన్స్ ఉంటాయి. 
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. 

దరఖాస్తు రుసుం:  జనరల్/ఓబీసీ-రూ.100. ఎస్సీ, ఎస్టీ, త్రివిధ దళాల్లో పనిచేస్తున్న/మాజీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్/నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్/అదర్ ర్యాంక్ ఆఫీసర్స్ కేటగిరీల అభ్యర్థులకు ఫీజు లేదు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. 

చివరి తేదీ:  ఫిబ్రవరి 5, 2018. 

వెబ్‌సైట్: 

http://www.upsconline.nic.in/ , http://www.upsc.gov.in/


మరింత సమాచారం తెలుసుకోండి: