స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రభుత్వరంగ బ్యాంకు అయిన “ఎస్‌బీఐ” జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది..ఆన్ లైన్ లో నిర్వహించే ప్రిలిమ్స్ ,మెయిన్స్ పరీక్షలలో ప్రతిభ చూపిన అభ్యర్తులని ఎంపిక చేస్తారు..

 Image result for sbi

ఖాళీల వివరాలు..
రెగ్యులర్ ఖాళీలు: 7200 (అన్ని వర్గాలు కలిపి)
బ్యాక్‌లాగ్ ఖాళీలు: 1101 (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మాత్రమే)
మొత్తం: 8301

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..

అమరావతి సర్కిల్ పరిధి: 400
హైదరాబాద్ సర్కిల్ పరిధి: 110
(బ్యాక్‌లాగ్ విభాగంలో 145 ఎస్సీ కేటగిరీ ఖాళీలు ఉన్నాయి). 

గమనిక: అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత: 2018 జనవరి 1 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హత ఉండాలి. 2018 జనవరి...1 నాటికి ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (ఐడీడీ) పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 2018 జనవరి 1 నాటికి 20-28 ఏళ్లు. (1990 జనవరి 2 - 1998 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి). ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు; ఓబీసీలకు 3 ఏళ్లు; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల పాటు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వీరితో పాటు ప్రభుత్వం గుర్తించిన ఇతర మినహాయింపు వర్గాలకు నిబంధనల మేరకు వయో సడలింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియలో మొత్తం 3 దశలుంటాయి. ఇందులో భాగంగా మొదట ప్రిలిమినరీ ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో నిర్దేశిత మార్కులు సాధించిన వారికి ఆన్‌లైన్‌లో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులోనూ కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులకు తుదిగా తాను ఎంచుకున్న అఫిషియల్/ స్థానిక భాష సంబంధిత పరీక్ష ఉంటుంది. దీనిలో రాష్ట్ర అధికార భాషను రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకునే నైపుణ్యాలను పరీక్షిస్తారు. పదో తరగతి/ ఇంటర్‌లో సదరు సబ్జెక్టును చదివి ఉంటే ఎటువంటి భాష ప్రావీణ్య పరీక్షలు లేకుండానే ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: ఆన్‌లైన్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. ప్రతి కేటగిరీ నుంచి ఖాళీలకు 10 రెట్ల మందిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.

మెయిన్: పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. ప్రశ్నలను మల్టిపుల్ చారుుస్ విధానంలో ఉంటాయి. మొత్తం 190 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది. సమయం 2.40గం.
ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల్లో సబ్జెక్ట్‌వైజ్‌గా ప్రత్యేకంగా సెక్షనల్ సమయం ఉంటుంది. రుణాత్మక మార్కులు ఉంటాయి. తుది ఎంపికలో ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకోరు.
ముఖ్య సమాచారం

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2018 ఫిబ్రవరి 10

ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100; జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600.
ప్రిలిమ్స్ టెస్ట్: 2018 మార్చి/ ఏప్రిల్
మెయిన్ పరీక్ష: 2018 మే 12 

వెబ్‌సైట్:    www.sbi.co.in/career 

 


మరింత సమాచారం తెలుసుకోండి: