హైదరాబాద్‌లోని ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్).. 56 బోధన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది... అయితే వీటిలో ప్రొఫెసర్.. అసోసియేట్ ప్రొఫెసర్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి సంభందిత పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా ప్రకటనలో విడుదల చేశారు..

Image result for university of hyderabad jobs

పోస్టులు-ఖాళీలు : ప్రొఫెసర్-18, అసోసియేట్ ప్రొఫెసర్-20, అసిస్టెంట్ ప్రొఫెసర్-18.

వేతనశ్రేణి:  ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్-రూ.37,400-రూ.67,000; అసిస్టెంట్ ప్రొఫెసర్-రూ.15,600-రూ.39,100.
బోధనాంశాల వారీ ఖాళీలు: మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్-11, ఫిజిక్స్-6, కెమిస్ట్రీ-3, యానిమల్ బయాలజీ-1, బయోకెమిస్ట్రీ-3, ఇంజనీరింగ్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ-4, హెల్త్ సైకాలజీ-2, ఎకనమిక్స్-6, ఎడ్యుకేషన్-1, ఇంగ్లిష్-1, పొలిటికల్ సైన్స్-4, సోషియాలజీ-3, ఆంత్రోపాలజీ-3, ఫిలాసఫీ-3, ఉర్దూ-2, అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్‌లేషన్ స్టడీస్-1, మేనేజ్‌మెంట్ స్టడీస్-2. 

అర్హతలు:  సంబంధిత పోస్టులు, బోధనాంశాలను అనుసరించి పీహెచ్‌డీ/మాస్టర్స్ డిగ్రీ+పీహెచ్‌డీ/బీఈ/బీటెక్+ఎంఈ/ఎంటెక్/తత్సమాన విద్య. అలాగే నిబంధనల మేరకు బోధనానుభవం, జర్నల్స్ ప్రచురణ, మార్కుల శాతం, నెట్/స్లెట్/సెట్ (అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు), అకడమిక్ రికార్డు తదితర అర్హతలుండాలి.

 ఎంపిక:  ప్రీవియస్ రికార్డ్, ఇంటర్వ్యూ (సెమినార్/కొల్లోక్వియం/..). 

దరఖాస్తు రుసుం: రూ.1,000 (జనరల్/ఓబీసీ/థర్డ్ జెండర్); రూ.300 (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ). 

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్‌కాపీ ప్రింటవుట్‌కు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు, ఫొటోలు, డీడీ తదితర అవసరమైన వాటిని జతచేసి ‘ది అసిస్టెంట్ రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్ సెల్), రూమ్.నెం.221, ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్ సీఆర్.రావ్ రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ పీ.వో., గచ్చిబౌలి, హైదరాబాద్-500046, తెలంగాణ’ చిరునామాకు పోస్టు/కొరియర్ ద్వారా గడువులోగా చేరేలా పంపాలి. 

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఫిబ్రవరి 1, 2018.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 5, 2018. 

హార్డ్‌కాపీ చేరడానికి చివరి తేదీ: మార్చి 12, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:     www.uohyd.ac.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: