రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)... స్పెషల్ డ్రైవ్-2018 కింద దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలలో  27 ఖాళీల భర్తీకి దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..అయితే సంభందిత శాఖలలో అసిస్టెంట్లు కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.. వేతన శ్రేణి..అర్హతలు తదితర అంశాలు వివరించింది..

Image result for rbi assistant notification 2018

పోస్టు:  అసిస్టెంట్ 

వేతన శ్రేణి:  రూ.13,150- రూ.34,990 (ప్రారంభ బేసిక్ పే-రూ.14,650). 

కార్యాలయాల వారీ ఖాళీలు:  అహ్మదాబాద్-2; బెంగళూరు-1; భోపాల్-1; భువనేశ్వర్-1; చండీగఢ్-3; హైదరాబాద్-1; జైపూర్-2; జమ్మూ-1; కాన్పూర్ అండ్ లక్నో-5; కోల్‌కతా-4; ముంబై-4; నాగ్‌పూర్-1; పాట్నా-1. 

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ తెలిసుండాలి. అలాగే దరఖాస్తు చేసుకొనే కార్యాలయం ఉన్న ప్రాంతానికి చెందిన స్థానిక భాషలో పట్టు (రాయడం, మాట్లాడడం, చదవడం) ఉండాలి. సాయుధ దళాల్లో కనీసం 15 ఏళ్లు పనిచేసిన మాజీ సైనికోద్యోగ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు పదోతరగతి/తత్సమాన విద్య ఉత్తీర్ణత సరిపోతుంది. 

వయసు: 2018, జనవరి 1 నాటికి 20-28 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ). 
లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ): మెయిన్ ఎగ్జామినేషన్‌లో నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణులైన వారికి దీన్ని నిర్వహిస్తారు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న కార్యాలయం ఉన్న రాష్ట్రానికి చెందిన స్థానిక/అధికార భాషలో పట్టుపై పరీక్ష ఉంటుంది. 

దరఖాస్తు రుసుం: రూ.50 (ఇంటిమేషన్ చార్జీలు). స్టాప్ అభ్యర్థులకు మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. 

దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 19, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.rbi.org.in


మరింత సమాచారం తెలుసుకోండి: