భారత రైల్వే మంత్రిత్వ శాఖ..ఎన్నడు లేని విధంగా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్‌తో ఎంతో మంది నిరుద్యోగులు ముందుకొచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ), టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సంయుక్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

Image result for railway jobs 2018

ఉద్యోగాలు:   అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ), టెక్నీషియన్. 

మొత్తం ఖాళీలు:  26,502. 

ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్ ఖాళీలు: 3,262. 

విద్యార్హతలు:  పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ఇంజనీరింగ్ డిప్లొమా/ఇంజనీరింగ్డిగ్రీ/ట్రేడ్ అప్రెంటీస్‌షిప్/ఇంటర్మీడియెట్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్)

వయసు:  2018, జూలై 1 నాటికి 18-28 ఏళ్లు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు; ఓబీసీ నాన్ క్రీమీలేయర్ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. అదే విధంగా పీడబ్ల్యూడీ అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం:

ఏఎల్‌పీ/టెక్నీషియన్ పోస్టులకు ఉమ్మడిగా రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఉంటుంది. ఏఎల్‌పీ పోస్టుకు పోటీపడుతూ, రెండో దశ సీబీటీలో అర్హత సాధించిన వారికి అదనంగా కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (సైకో మెట్రిక్) నిర్వహిస్తారు.

 

తొలిదశ సీబీటీ ప్రశ్నపత్రంలో 75 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి గంట. మ్యాథమెటిక్స్; జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్; జనరల్ సైన్స్; జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. తొలిదశలో అర్హత సాధించిన వారికి రెండోదశ సీబీటీ నిర్వహిస్తారు. కమ్యూనిటీ వారీగా మొత్తం పోస్టులకు 15 రెట్ల అభ్యర్థులను రెండోదశ పరీక్షకు పిలుస్తారు.

 

రెండోదశ పరీక్షలో పార్ట్-ఏ (100 ప్రశ్నలు, 90 నిమిషాలు), పార్ట్-బీ (75 ప్రశ్నలు, 60 నిమిషాలు) ఉంటాయి.

పార్ట్-ఏలో మ్యాథమెటిక్స్; జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్; బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; జనరల్ అవేర్‌నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-బీ (అర్హత పరీక్ష మాత్రమే)లో సంబంధిత ట్రేడ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.

మొదటి, రెండో దశ సీబీటీలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత విధిస్తారు.

తదుపరి ఎంపిక ప్రక్రియకు రెండోదశలోని పార్ట్-ఏలో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.


ముఖ్య సమాచారం..

ఏదో ఒక ఆర్‌ఆర్‌బీని మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

పరీక్ష ఫీజు:   ఏస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్/పీడబ్ల్యూడీ/మహిళలు/ట్రాన్స్‌జెండర్/మైనారిటీలు/ఈబీసీ అభ్యర్థులకు రూ.250. మిగిలిన వారికి రూ.500
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  మార్చి 5, 2018.
తొలిదశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష:  ఏప్రిల్/మే, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  rrbsecunderabad.nic.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: