ఐడీబీఐ బ్యాంకులో సుమారు 760 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కోసం దరఖాస్తులు కోరుతోంది..ఎంపికైన అభ్యర్థులు మూడేళ్లు కాంట్రాక్టు వ్యవధిలో పనిచేయాల్సి ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంటే అభ్యర్థి పనితీరు, ప్రవర్తన ఆధారంగా అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఏ) హోదాలో నియమిస్తారు.

 Image result for idbi bank recruitment 2018

పోస్టు:   ఎగ్జిక్యూటివ్.

మొత్తం ఖాళీలు:  760 (ఎస్సీ-122+ఎస్టీ-56+ఓబీసీ-202+ అన్‌రిజర్వుడ్-380). 

వేతనం:  కాంట్రాక్టు వ్యవధిలో మొదటి ఏడాది రూ.17,000; రెండో ఏడాది రూ.18,500; మూడో ఏడాది రూ.20,000. కాంట్రాక్టు వ్యవధి విజయవంతంగా పూర్తిచేస్తే అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఏ) హోదా వేతన శ్రేణి అందుతుంది. 

అర్హతలు: కనీసం 60 శాతం (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ కేటగిరీలకు 55 శాతం) మార్కులు/తత్సమాన గ్రేడ్‌తో ఏదైనా డిగ్రీ/తత్సమాన విద్యలో ఉత్తీర్ణత. 

వయసు:  2018, జనవరి 1 నాటికి 20-25 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల మేర గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రి-రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్. 

రాతపరీక్ష విధానం: 

దీన్ని ఆన్‌లైన్ విధానంలో 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కు కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. రాతపరీక్షలో నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్ జాబితా నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. అనంతరం ప్రి-రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక నిర్వహిస్తారు. 
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. 

దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ-రూ.150 (ఇంటిమేషన్ చార్జీ మాత్రమే); మిగిలిన అభ్యర్థులకు రూ.700 (అప్లికేషన్ ఫీ+ఇంటిమేషన్ చార్జీ).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.idbi.com  


మరింత సమాచారం తెలుసుకోండి: