దేశ అత్యున్నత అఖిల భారత సర్వీసుల్లో చేరాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం..సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2018’కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది..ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారెన్ సర్వీస్) వంటి 24 ప్రతిష్టాత్మక పౌరసేవ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు రాయాల్సిన పరీక్ష. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) నోటిఫికేషన్‌తో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) పరీక్షకూ యూపీఎస్సీ ప్రకటన వెలువరించింది..

Image result for civils notification 2018
ఖాళీల సంఖ్య:  సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా సుమారు 782 ఖాళీలు

ఐఎఫ్‌ఎస్ ద్వారా 110 ఖాళీలు భర్తీ చేస్తారు.

 అర్హత: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐఎఫ్‌ఎస్‌కు యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్‌‌స, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీల్లో ఏదైనా ఒక సబ్జెక్ట్‌తో బ్యాచిలర్ డిగ్రీ లేదా అగ్రికల్చర్, ఫారెస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 2018 ఆగస్టు 1 నాటికి అభ్యర్థి వయసు 21 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి. (1986 ఆగస్టు 2 - 1997 ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి). ఓబీసీలకు మరో మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఇతర రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది. అలాగే..జనరల్ కేటగిరీ అభ్యర్థులు నిర్దిష్ట వయోపరిమితి వ్యవధిలో ఆరుసార్లు మాత్రమే పరీక్ష రాసేందుకు వీలుంది. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు తొమ్మిదిసార్లు పరీక్షకు హాజరు కావచ్చు. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులు గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లైనా పరీక్ష రాసుకోవచ్చు.

ఎంపిక విధానం:   ఎంపికలో భాగంగా ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రతిదశలోనూ వడపోత ఉంటుంది.

ప్రిలిమినరీ పరీక్ష:  సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమ్స్. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లతో 400 మార్కులకు ఉంటుంది. ప్రతి పేపర్‌కు 200 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కులకోత ఉంటుంది. ప్రిలిమ్స్‌లో నిర్దేశించిన కనీస అర్హత మార్కులు పొందిన అభ్యర్థులను, మొత్తం ఉన్న ఖాళీల సంఖ్యకు 1:12 లేదా 1:13 (అంటే ఒక్కో పోస్ట్‌కు 12 లేదా 13) నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. పేపర్ -2 (ఆప్టిట్యూడ్ టెస్ట్)లో 33 శాతం మార్కులు పాంది, పేపర్ -1 (జనరల్ స్టడీస్)లో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్‌కు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇక మెయిన్ పరీక్షలో మొత్తం తొమ్మిది పేపర్లు ఉంటాయి. వీటిల్లో పేపర్-ఎ (రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్ ఉన్న భాషల్లో నుంచి ఏదేని ఒక లాంగ్వేజ్ టెస్ట్), పేపర్-బి (ఇంగ్లిష్)లు భాష పరీక్షలు. ఇవి అర్హత పరీక్షలు మాత్రమే. వీటితోపాటు మెయిన్‌లో ఏడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులు చొప్పున మొత్తం 1750 మార్కులకు మెయిన్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే ఖాళీల సంఖ్యకు 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు ఆహ్వానిస్తారు. ఇది 275 మార్కులు ఉంటుంది. మొత్తంగా 2025 మార్కులకు పొందే మార్కుల ద్వారా తుది ఎంపిక జరుగుతంది.


ఫీజు: రూ. 100 (మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఫీజు లేదు). 

ఆన్‌లైన్ దరఖాస్తులు: మార్చి 6, 2018 సాయంత్రం ఆరు గంటల వరకు https://upsconline.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ‘ఫస్ట్ అప్లై - ఫస్ట్ అలాట్’ ప్రాతిపదికన పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు. 
తెలంగాణ, ఏపీల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్.

మెయిన్స్ పరీక్ష కేంద్రాలు:  హైదరాబాద్, విజయవాడ.

ప్రిలిమినరీ పరీక్ష తేది:   2018 జూన్ 3

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

 


మరింత సమాచారం తెలుసుకోండి: